Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Telangana USA: అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై దాడి..!

USA: అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై దాడి..!

by Satya
Hyderabad youth attacked in America

అమెరికాలో చదువుకుంటున్న ఓ హైదరాబాద్ యువకుడిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ఫోన్, వాలెట్ దొంగిలించారు. దీంతో, బాధితుడి కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. అతడికి సరైన వైద్యం అందేలా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ కు చెందిన సయ్యద్ మజర్ అలీ షికాగోలోని ఇండియానా వెస్లెయాన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. స్థానికంగా ఉన్న వెస్ట్ రిడ్జి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. ఫిబ్రవరి 4న బాధితుడి అపార్ట్‌మెంట్ ‌సమీపంలోనే అతడిపై దాడి జరిగింది. ఈ దాడిలో మజర్ అలీ రక్తసిక్తమయ్యాడు. పలుచోట్ల గాయాలయ్యాయి. కళ్లపై ముష్టిఘాతాలు కురిపించారని, ముఖం, ఛాతి, వీపుపై ఇష్టారీతిన తన్నారని చెప్పాడు. ఫోన్‌తో పాటు వాలెట్ కూడా తీసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై హైదరాబాద్‌లో ఉంటున్న అలీ భార్య, ముగ్గురు పిల్లలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్త వద్దకు వెళ్లేందుకు సాయం చేయాలంటూ బాధితుడి భార్య విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్‌కు విజ్ఞప్తి చేసింది. Read Also..

Advertisements

You may also like

Our Visitor

014136
Total views : 79139

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.