Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Political ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే..!

ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే..!

by Rama
Lokesh who invented the pylon

తెలుగుదేశం పాలనలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే.. జగన్ అధికారంలోకి వచ్చాక గంజాయి క్యాపిటల్ గా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా ఎన్నికల ముందు కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు. మోసం, దగా, కుట్రలకు ప్యాంటూ షర్టు తొడిగితే జగన్ లా ఉంటుందంటూ తీవ్ర విమర్శలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ‘శంఖారావం’ యాత్రను లోకేశ్ ప్రారంభించారు.అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అమ్మలాంటిదని, అమ్మప్రేమకు ఎలా కండిషన్స్‌ ఉండవో.. ఇక్కడి ప్రజలు కూడా అంతేనని చెప్పారు. పౌరుషాలు, పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా అని అన్నారు. గరిమెళ్ల సత్యనారాయణ, గౌతు లచ్చన్న, ఎర్రన్నాయుడు పుట్టిన గడ్డ ఇది.. ఇలాంటి ప్రాంతంలో ‘శంఖారావం’ యాత్ర ప్రారంభిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు. Read Also..

Advertisements

You may also like

Our Visitor

039229
Total views : 194879

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: