Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh ‘ రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలకు.. ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

‘ రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలకు.. ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

by Satya
Rajadhani Files

రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్లతో పాటు అన్ని రికార్డులు సక్రమంగానే ఉన్నాయని పేర్కొంటూ సినిమాను విడుదల చేసుకోవచ్చని పేర్కొంది. గురువారం ఈ సినిమా విడుదలపై విధించిన స్టేను ఎత్తివేసింది. దీంతో సినిమా విడుదలకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ రాజధాని ఫైల్స్ సినిమా విడుదలను అడ్డుకోవాలని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. గురువారం సినిమా విడుదలపై స్టే విధించింది. సినిమాకు సంబంధించిన పూర్తి రికార్డులను అందజేయాలని నిర్మాతలను ఆదేశించింది.

ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ :

శుక్రవారం విచారణ జరగగా.. ఏపీ ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాపై స్టే కొనసాగించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. నిర్మాతల తరపు న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ… రివిజన్ కమిటీ సూచనల మేరకు పలు సన్నివేశాలను తొలగించినట్లు చెప్పారు. ఆ తర్వాతే తమకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందన్నారు. డిసెంబర్ లో తమకు సెన్సార్ సర్టిఫికెట్ వస్తే… వైసీపీ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించిందని చెప్పారు. ఈ క్రమంలో సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్‌లు, రికార్డ్‌లను పరిశీలించిన కోర్టు.. అన్నీ సక్రమంగానే ఉన్నాయని పేర్కొంటూ సినిమాను విడుదల చేసుకోవచ్చని అనుమతినిచ్చింది. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • అనంతపురంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం.
    అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు కీలక పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సుజ్లాన్‌ విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్న 1,325 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం…
  • వైభవంగా గోదావరి పుష్కరాలు.
    గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 8…

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: