తెలుగుదేశం పార్టీ రా కదలిరా బహిరంగ సభ కు బాపట్ల నియోజకవర్గ ఇన్చార్జి వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. బైకులు, కార్లు, ఆటోలలో ర్యాలీగా 3000 వాహనాలలో ఇంకొల్లు సభకు తరలి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వేగేశన నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడుతూ ఇంకొల్లు చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభలో మేము సైతం పెద్ద ఎత్తున తరలి వెల్తున్నామన్నారు. రాబోయే 60 రోజుల్లో ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుండి 30, 40 వేల మెజార్టీతో తెలుగు దేశం పార్టీ గెలిచే విధంగా ఈ రోజు నుండే శంఖారావం పూరిస్తూ చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రిని చేసేంతవరకు అవిశ్రాంతంగా పోరాడుతాం అని వేగేశన నరేంద్ర వర్మ అన్నారు.
నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో రా కదలిరా బహిరంగ సభ…
98
previous post