Wednesday, June 3, 2026
News Navigation
Wednesday, June 3, 2026
News Navigation

Breaking

Wednesday, June 3, 2026
Home Latest News ఢిల్లీ పర్యటన కేంద్ర మంత్రులను కలవనున్న రేవంత్‌రెడ్డి

ఢిల్లీ పర్యటన కేంద్ర మంత్రులను కలవనున్న రేవంత్‌రెడ్డి

by Satya
Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఢిల్లీ వెళ్ళారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర బృందం పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నది. జాతీయ రహదారులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పలు ప్రతిపాదనలపై కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల విషయమై సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీతో రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు నార్త్ బ్లాక్‌లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఏయే పద్దుల కింద ఎంత మొత్తంలో రావాలి, పెండింగ్‌లో ఉన్నవెన్ని తదితరాలను వివరించనున్నారు. దీర్ఘకాలంగా బకాయిగా ఉన్న నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే రిలీజ్ చేసేలా సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీని కోరనున్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి వెనకబడిన జిల్లాల అభివృద్ధి స్కీమ్ కింద రావాల్సిన నిధుల గురించి ఇప్పటికే పలుమార్లు వివరించగా మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున విడుదల చేయాల్సిందిగా కోరనున్నారు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.
    నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన రహదారి గత ఏడాదిన్నరగా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గుంతలతో నిండిన ఈ రోడ్డు వాహనదారులకు నిత్యం ప్రమాదకరంగా మారింది. దుమ్ము, ధూళితో కప్పుకుపోయిన ఈ…
  • ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..
    అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణవాసి అనురూప్‌ రెడ్డి ..ముగ్గురు స్నేహితులను కాపాడి..అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా ముగ్గురు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు లూసియానాలోని టొరోడో పార్క్‌లోని సెబాన్ రివర్‌లోకి కోడూరు అనురూప్ రెడ్డి వెళ్లాడు. హఠాత్తుగా…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

019595
Total views : 91190

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.