Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Latest News యూసీసీ చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో బీజేపీ ప్రభుత్వం

యూసీసీ చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో బీజేపీ ప్రభుత్వం

by Rama
UCC Act

యూసీసీ చట్టం (UCC Act):

ఉమ్మడి పౌరస్మృతి- యూసీసీ చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్న అసోంలోని బీజేపీ ప్రభుత్వం.. ఆ దిశగా తొలి అడుగు వేసింది. సీఎం హిమంత శర్మ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముస్లిం వివాహ, విడాకుల నమోదు చట్టం-1935 ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ మీటింగ్ అనంతరం రాష్ట్ర మంత్రి జయంత మల్లాబార్వా మాట్లాడుతూ, ముస్లిం వివాహ చట్టాన్ని రద్దు చేయాలని మంత్రిమండలి నిర్ణయించినట్టు వెల్లడించారు. అసోంలో ముస్లిం వివాహాలు, విడాకులు ఈ చట్టం కింద నమోదుకావని.. ఇలాంటి విషయాలన్నీ ప్రత్యేక వివాహ చట్టం కింద ఉండాలని అనుకుంటున్నామని తెలిపారు. తాజా నిర్ణయంతో బాల్య వివాహాలను తగ్గించడంలో దోహదపడుతుందని అన్నారు. ఈ చట్టం కింద వివాహాలను నమోదుచేస్తున్న 94 మంది ముస్లిం రిజిస్ట్రార్‌లకు నష్టం జరగకుండా 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు జయంత తెలిపారు. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.


రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని …
నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం సంచలన ప్రకటన.
దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అంశం..పార్లమెంట్ లోపల, బయట తీవ్ర దుమారాన్ని రేపుతోంది. …
సోనమ్‌ వాంగ్‌చుక్‌కు తీవ్ర అస్వస్థత.
ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనను ఢిల్లీలోని …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

042274
Total views : 223705

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: