Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra PradeshKrishana పోలీసు వృత్తి కత్తి మీద సాములాంటిది..

పోలీసు వృత్తి కత్తి మీద సాములాంటిది..

by Rama
Police

పోలీసు వృత్తి ఒక కత్తి మీద సాము లాంటిదని, పోలీస్ యంత్రాంగం విధి నిర్వహణలో సక్రంగా సమన్వయం పాటించి విధులను సక్రమంగా నిర్వహించాలని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మోపిదేవిలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 1.40 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ స్థానిక శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, కృష్ణా జిల్లా ఎస్పీ ఆద్నానయీమ్ఆస్మి, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక తో కలిసి ఏలూరు రేంజ్ డీఐజీ జి.వి.జి అశోక్ కుమార్ ప్రారంభించారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పోలీస్ యంత్రాంగం విధులను సక్రంగా నిర్వహించాలని ఆయన సూచించారు. నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభించడం ఎంతో ఆనందదాయకమని ఆయన అన్నారు. మోపిదేవిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శించుకోవటానికి విచ్చేసే భక్తులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు విధులను కూడా సక్రమంగా నిర్వహించాలని ఆయన సూచించారు. అనంతరం పోలీసు అదికారులు తో కలిసి హంసలదీవి గ్రామంలోని రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలుతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారితీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఇది చదవండి: యాత్ర ఏర్పాట్లపై బీజేపీ నాయకులతో బండి సంజయ్ భేటీ..


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

019358
Total views : 90539

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.