Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Telangana తెలంగాణ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ

తెలంగాణ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ

by Satya
Rahul Gandhi


కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు కాంగ్రెస్‌ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది.

ఇది చదవండి: యూసీసీ చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో బీజేపీ ప్రభుత్వం

రాహుల్‌ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్‌ వర్గాలు ఆశాజనకంగా ఉన్నాయి. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్నాళ్ల క్రితం ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయదలచుకోలేదని, నియోజకవర్గానికి న్యాయం చేయలేనని సోనియా పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..
తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్‌ సృష్టించిన సీఎం విజయ్‌..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం …
రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..
ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు భారీ ఊరట లభించింది. హర్యానాలోని …
మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..
మహారాష్ట్రలోని పుణెలో ఓ యువకుడు చేసిన నకిలీ బాంబు కలకలం వెయ్యిమంది పోలీసులను పరుగులు పెట్టించింది. …

Advertisements

You may also like

Our Visitor

014285
Total views : 79732

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.