Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Telangana ముగిసిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం..!

ముగిసిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం..!

by Satya
Congress Vijayabheri Yatra

ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణతో సహా మరో నాలుగు రాష్ట్రాల ఎంపీ అభ్యర్థులపై కాంగ్రెస్ హైకమాండ్‌ సుధీర్ఘంగా చర్చించింది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి టికెట్ ఆశిస్తున్న అశావహుల జాబితాను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హైకమాండ్ ముందుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటేందుకు అన్ని వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ కాసేపట్లోనే ప్రకటించే అవకాశం ఉంది. ఆ జాబితాలో కరీంనగర్ నుంచి ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్‌ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, నల్గొండ నంచి జానారెడ్డి లేదా పటేల్ రమేష్ రెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి వంశీచంద్‌ రెడ్డి, నాగర్ కర్నూల్ సంపత్ లేదా మల్లు రవి పేర్లు ఉండే అవకాశం ఉంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: నాగర్ కర్నూల్ పార్లమెంట్ ప్రజలకు త్వరలోనే శుభవార్త…


ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..
ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని …
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి .
విద్యపై తాము పెట్టేది ఖర్చు కాదన… పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. …
ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం.
జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు జీవనాడిగా భావించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్‌ అంశం మరోసారి …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

025669
Total views : 147658

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.