Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Health తాటి ముంజలు తినడం వల్ల కలిగే లాభాలు..!

తాటి ముంజలు తినడం వల్ల కలిగే లాభాలు..!

by Satya
Tati Munjala

తాటి ముంజలు(Taati Munjalu):

తాటి ముంజల్లో విటమిన్‌ బి, ఐరన్‌, కాల్షియం, సి,ఎ.విటమిన్లు, జింకు పాస్పరస్‌, పొటాషియం, ధయామిన్‌, రిబో ప్లేవిస్‌, నియాసిస్‌ వంటి బీ కాంప్లెక్స్‌ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఎండాకాలంలో మాత్రమే లభించే వీటిని ఐస్ యాపిల్స్ అని కూడా పిలుస్తారు. మూడు తాటి ముంజలు ఒక కొబ్బరి బొండంతో సమానమని నిపుణులు చెప్పుతున్నారు. తాటి ముంజలను తినటం వలన రక్త సరఫరా మెరుగుపడి రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. దాంతో గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఎండాకాలంలో మ‌న శరీరం త్వరగా నీటిని కోల్పోతుంది. ఈ క్ర‌మంలో డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌తాం. అయితే అలాంటి పరిస్థితిలో తాటి ముంజ‌ల‌ను తింటే శ‌రీరంలోకి ద్ర‌వాలు వ‌చ్చి చేర‌తాయి. డీహైడ్రేషన్ బారి నుంచి బయట పడవచ్చు. జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి సమస్యలు తొలగిపోయి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. వేస‌విలో ఎండల కార‌ణంగా వాంతులు, విరేచ‌నాలు అవుతున్న సమయంలో ముంజలను తింటే ఆ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. తాటి ముంజ‌ల‌లో ఉండే పొటాషియం శ‌రీరంలో ఉన్న విష ప‌దార్థాల‌ను బ‌య‌టికి పంపుతుంది. దీంతో శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌మ‌వుతుంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: బరువు తగ్గాలి అంటే ఈ పండ్లు తినండి.. రిజల్ట్‌ పక్కా..!


షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .
* నేరేడుగింజలు షుగర్ వ్యాధకి అద్భుతంగా పరిచేస్తాయి. గింజల్ని మెత్తగా దంచి అన్నంలో కలుపుకొని తినవచ్చు. …
హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..
ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం …
ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..
ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039625
Total views : 198770

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: