ప్రజలు ఆశీస్సులతోనే ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ(YCP) కండువా కప్పుకున్నానని ముద్రగడ పద్మనాభం తెలిపారు. పదవులు ఆశించకుండానే పార్టీలో చేరానన్నారు. రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావాలి.. కాపులు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు ఇంకా రాజకీయం తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఇచ్చిన 21 సీట్లు కూడా తిరిగి టీడీపీ(TDP)కి ఇచ్చేస్తే బెటర్ అని సెటైర్ వేశారు. పవన్‌ను మారుద్దామని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
రాజకీయాల్లో సినిమా వాళ్లను ప్రజలు నమ్మరు అని అన్నారు. మొన్న ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోవడం, ఇప్పుడు 21 స్థానాలకు పరిమితం కావడంతో పవన్ బలం ఏంటో ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. 21 సీట్లల పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎన్ని గెలవగలడో కూడా తెలియదన్నారు. ఎన్నికల తర్వాత జనసేన పార్టీ(Janasena party)క్లోజ్ అవ్వడం ఖాయమన్నారు. రాబోయే 30 సంవత్సరాల వరకు జగనే సీఎంగా ఉంటారని ముద్రగడ స్పష్టం చేశారు.
ఇది చదవండి: ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి