Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Devotional ఎగువ అహోబిలం క్షేత్రంలో ఘనంగా శ్రీ నరసింహుని కళ్యాణం..

ఎగువ అహోబిలం క్షేత్రంలో ఘనంగా శ్రీ నరసింహుని కళ్యాణం..

by Prakash
Nandyala district

నంద్యాల జిల్లా(Nandyala district), ఆళ్లగడ్డ

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలం క్షేత్రంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్వాలా నరసింహ స్వామి చెంచులక్ష్మి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేలాది మంది భక్తులు శ్రీవారి కల్యాణాన్ని తిలకించేందుకు అహోబిలం క్షేత్రానికి తరలి వచ్చారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున గోవింద నామస్మరణలతో నల్లమల గిరులు ప్రతిధ్వనించాయి. వేదమంత్రాల సాక్షిగా మేళ తాళాలు మంగళ వాయిద్య ఘోష నడుమ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీ వన్ శఠగోప శ్రీ రంగనాథ యతేంద్ర మహాదేశికన్ స్వామి వారి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు కళ్యాణానికి పూర్వ రంగంగా ఎదురుకోలు మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆళ్లగడ్డ ఆర్టీసీ డిఎం రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.
శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధి కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత కుమారుడు అనంత్ అంబానీ 48 …
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం.
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం నెలకొంది. ఆలయంలో ఉద్యోగాలంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ …
కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త.
కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి రంగం …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

025300
Total views : 146865

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.