Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana రేవంత్ రెడ్డి కి ప్రవీణ్ కుమార్ కౌంటర్..

రేవంత్ రెడ్డి కి ప్రవీణ్ కుమార్ కౌంటర్..

by Rama
Praveen Kumar-Revanth Reddy

తాము గేట్లు తెరిస్తే తమ పార్టీ ఖాళీ అవుతుందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత, నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (Praveenkumar) కౌంటర్ ఇచ్చారు. మీరు గేట్లు తెరిస్తే మీ వద్దకు గొర్రెలు వచ్చాయని… అదే మేం గేట్లు తెరిస్తే ఇక్కడికి సింహాలు వచ్చాయని చురక అంటించారు. నిజమైన తెలంగాణవాదులు బీఆర్ఎస్‌లో ఉన్నారని… తెలంగాణను మోసం చేసిన వాళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళంతా గేట్లు తోసుకుని అక్కడకు పోతున్నారని ఎద్దేవా చేశారు. పలువురు బీఎస్పీ నేతలు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన ఉద్యమం చారిత్రాత్మకమన్నారు. కేసీఆర్‌ పాలన స్వర్ణయుగమని… చితికిపోయిన తెలంగాణకు విముక్తి కల్పించారని కితాబునిచ్చారు. రాజ్యాంగ వ్యవస్థలైన ఈడీ, సీబీఐ అన్నింటినీ ప్రధాని మోదీ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: ఇంటి దొంగలను అంజన్నైనా పట్టుకోలేని చందం…


వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ.
డ్రగ్స్ నివారణపై వనపర్తి జిల్లా కొత్తకోటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన …
స్వతంత్ర భారత్‌లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది..
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీ చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ …
ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు.
సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 36 రోజుల్లోనే గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023143
Total views : 141179

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.