Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra PradeshKrishana భారీ ర్యాలీతో నామినేషన్ పూర్తిచేసిన సొంగా. రోషన్ కుమార్

భారీ ర్యాలీతో నామినేషన్ పూర్తిచేసిన సొంగా. రోషన్ కుమార్

by Rama
Roshan Kumar

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా సొంగా. రోషన్ కుమార్ (Songa Roshan Kumar) చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో గల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. ఈ రోజు ఉదయం జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో గల మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి లింగపాలెం మండలం రంగాపురం గ్రామంలో గల శ్రీ రామా సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి చింతలపూడి చేరుకొని తహసీల్దార్ కార్యాలయంలో గల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

నామినేషన్ తరువాత సొంగా రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నా మీద కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తూ సీటు మారుస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆయన అన్నారు,నామినేషన్ కార్యక్రమానికి అభిమానులు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చారని అన్నారు.ప్రజలు నన్ను ఎమ్మెల్యే గా మరియు పుట్టా. మహేష్ యాదవ్ ను ఎంపీ గా గెలిపించాలని అన్నారు. గత 10 సంవత్సరాలుగా నా జీతంలో 10 శాతం మా ఆవిడ జీతంలో నుండి 10 శాతం ఖర్చుపెట్టి పేద ప్రజలకు సేవ చేసాను, అలాగే నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయను అలాగే చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళతాను అని ఆయన అన్నారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
  • అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
  • దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.
    రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి విదేశీ పర్యటన కొనసాగుతోంది. దక్షిణ కొరియా పర్యటనలో దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. మొదట ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీఈఓ హంగ్ జూ జియోన్‌,హ్యుందాయ్ మోబిస్ తోనూ…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

039195
Total views : 194673

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: