Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Telangana తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..!

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..!

by Satya
Telangana Inter results released

తెలంగాణ(Telangana) ఇంటర్ ఫలితాలు(Inter Results) బుధవారం (ఏప్రిల్‌ 24) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ(Education Principal Secretary) బుర్రా వెంకటేశం(Burra Venkatesham) తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నట్లు వెల్లడించారు. పరీక్ష రాసిన విద్యార్థులు పలితాలను http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/ లేదా https://results.cgg.gov.in/ వెబ్‌సైట్‌లోనూ చెక్ చేసుకోవచ్చని తెలిపారు.

ఇది చదవండి: ఏపీ, తెలంగాణలో నేడు నుంచి వేసవి సెలవులు ప్రారంభం..

అయితే.. తొలత ఇంటర్ మొదటి రెండవ సంవత్సరం ఫలితాలను ఏప్రిల్‌ 23న (మంగళవారం) విడుదల చేయాలని భావించారు. అయితే.. పలు కారణాలవల్ల ఏప్రిల్‌ 24 (బుధవారం) ఒకేసారి ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక.. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో.. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది కాగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,43,993 మంది ఉన్నారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు.. ద్వితీయ సంవత్సరంలో 46,542 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.
    నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన రహదారి గత ఏడాదిన్నరగా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గుంతలతో నిండిన ఈ రోడ్డు వాహనదారులకు నిత్యం ప్రమాదకరంగా మారింది. దుమ్ము, ధూళితో కప్పుకుపోయిన ఈ…
  • ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..
    అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణవాసి అనురూప్‌ రెడ్డి ..ముగ్గురు స్నేహితులను కాపాడి..అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా ముగ్గురు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు లూసియానాలోని టొరోడో పార్క్‌లోని సెబాన్ రివర్‌లోకి కోడూరు అనురూప్ రెడ్డి వెళ్లాడు. హఠాత్తుగా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

019445
Total views : 90730

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.