Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra Pradesh కూటమి శాసన సభా పక్ష సమావేశం ప్రారంభం..

కూటమి శాసన సభా పక్ష సమావేశం ప్రారంభం..

by Satya
Alliance Legislative Assembly party meeting begins

తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్‌లో భేటీ అయ్యారు. ముందుగా కూటమి మూడు పార్టీ అధినేతలైన చంద్రబాబు, పవన్, పురందేశ్వరి, ఎమ్మెల్యేలు అంతా వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలంతా తమ నాయకుడు చంద్రబాబేనని ముక్తకంఠంతో బలపరిచారు.అదేవిధంగా కూటమి తరఫున సీఎంగా చంద్రబాబు పేరును జనసన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, కూటమి ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు సంయుక్తంగా గవర్నర్‌కు పంపనున్నారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానించాలని కోరనున్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News


  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • అనంతపురంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం.
    అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు కీలక పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సుజ్లాన్‌ విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్న 1,325 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం…
  • వైభవంగా గోదావరి పుష్కరాలు.
    గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 8…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: