Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Telangana ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న మంత్రి పొన్నం

ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న మంత్రి పొన్నం

by Satya
ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న మంత్రి పొన్నం

రుణమాఫీకి సంబంధించి విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని… విడతలవారీగా కాకుండాఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న మంత్రి పొన్నం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో తానూ భాగస్వామిని కావడం రైతుబిడ్డగా సంతోషిస్తున్నానన్నారు. వరంగల్ డిక్లరేషన్‌లో భాగంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని… ఆ హామీని నెరవేరుస్తున్నామన్నారు.ఏ రోజు నుంచి రుణమాఫీ అమలు అవుతుందనేది త్వరలోనే విధి విధానాలు వస్తాయన్నారు. ఇందుకు సంబంధించి జీవో విడుదల చేస్తామన్నారు. గతంలో విడతల వారీగా రుణమాఫీ జరిగేదని… ఇప్పుడు అలా ఉండదన్నారు. రైతు బిడ్డగా సహచర మంత్రులకు, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019413
Total views : 90685

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.