Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Telangana రైతుల ఖాతాల్లోకి రేపే రుణమాఫీ

రైతుల ఖాతాల్లోకి రేపే రుణమాఫీ

by Satya
రైతుల ఖాతాల్లోకి రేపే రుణమాఫీ

అర్హులైన రైతులకు రేషన్‌కార్డు లేకున్నా 2 లక్షల వరకురైతుల ఖాతాల్లోకి రేపే రుణమాఫీ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులకు రుణమాఫీ వర్తించదని తెలిపారు. రేపు లక్షలోపు రుణాల మొత్తం 6 వేల కోట్లకు పైగా జమ చేస్తామన్నారు. ఆగస్టు 15లోగా మిగతా రూ.లక్ష రుణమాఫీ చేస్తామని తెలిపారు. మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చిన విధంగా ఆగస్టు 15నాటికి రుణమాఫీని పూర్తి చేస్తామన్నారు. ఇందుకు మొత్తం 31 వేల కోట్లు జమ చేస్తామని తెలిపారు. తెల్ల రేషన్‌కార్డులు లేని రైతుల వద్దకు వ్యవసాయశాఖ అధికారులు వెళ్లి పరిశీలిస్తారన్నారు. రాష్ట్రంలో మొత్తం 32 బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చాయని..అయితే నకిలీ పట్టా పాసుపుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్నవారిని గుర్తించామన్నారు. లక్ష జీతం ఉన్నవాళ్లకు రుణమాఫీ వర్తించదని..అలాంటి వారు 17 వేల మంది ఉన్నారని మంత్రి తుమ్మల తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019570
Total views : 91126

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.