పెద్దపల్లి జిల్లా రామగుండం లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని బిజెపి శ్రేణులు పోరుబాట పట్టాయి. రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బిజెపి కార్యకర్తలకు పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట చోటు చేసుకుంది. కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో ఎమ్మార్వో ఆఫీస్ రాజీవ్ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా బిజెపి నియోజకవర్గ ఇంచార్జీ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణ చేపట్టాక పోవడంతో ఆసుపత్రి నిర్మాణం ఆగిపోయిందని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసిన పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి స్థల సేకరణ చేసి, ఆస్పత్రి నిర్మాణానికి సహకరించాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రామగుండం తహసిల్దార్ కుమారస్వామి కి వినతి పత్రం అందజేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్.దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- 22ఏపై బీజేపీ దీక్షలు.భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
- భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి