Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Latest News పత్తి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

పత్తి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

by Satya
పత్తి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

రాష్ట్రంలో రైతులు పండించిన పత్తినంతా సీసీఎల్ కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, జౌళి శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో పత్తి సాగు, ఉత్పత్తి పెరగడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా కలిగేలా నూతన వంగడాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేస్తేనే సెస్ తొలగిస్తామని పత్తి స్పిన్నింగ్, జిన్నింగ్ వ్యాపారులకు మంత్రులు స్పష్టం చేశారు. పత్తి రైతుల దగ్గర మొత్తం పంట కొనుగోలు చేసేలా సీసీఎల్ కు, కేంద్రానికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ఈ క్రాప్‌లో తప్పనిసరిగా పత్తి రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ క్రాప్‌లో నమోదు చేసిన పంటనంతా సీసీఐ కొనుగోలు చేయాలని ఆ సంస్థ ప్రతినిధికి స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ క్రాప్‌లో నమోదు వల్ల ప్రభుత్వం అందించే ఫలాలతో లబ్ధిపొందొచ్చునని రైతులకు అవగాహన కల్పించాలన్నారు.పత్తి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.పత్తి సేకరణలో ప్లాస్టిక్ వినియోగంపై నివారణకు జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లర్లు ముందుకు రావాలన్నారు. ప్లాస్టిక్ సంచుల్లో వచ్చే పత్తిని కొనుగోలు చేయబోమని రైతులకు తేల్చి చెప్పాలన్నారు. ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతుందన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. కేసులకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో…
  • రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.
    కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా పార్టీకి సంబంధించిన అంశాలపై మాట్లాడటం సబబు కాదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణిస్తున్నామని.. ఈ వ్యవహారంపై హైకమాండ్ దృష్టి కూడా ఉందన్నారు.…
  • ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.
    అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఈ నెల 25న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. కనేకల్-1, కనేకల్-2 పేర్లతో ఏర్పాటు చేయబోయే పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో…
  • సింహాచలంలో వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు.
    విశాఖపట్నం సింహాచల పుణ్యక్షేత్రంలో శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రీ సింహవల్లి తాయారు సన్నిధిలో లక్ష కుంకుమార్చన పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రావణమాసంలో తొలి శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తుండటంతో.. ప్రత్యేక పూజలకు భక్తులు…
  • బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.
    హైదరాబాద్ బాలానగర్‌లో గంజాయి ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన తెలంగాణ ఈగల్ పోలీసులకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. నిందితులు పోలీసులపై కుక్కను వదలడంతో పాటు స్క్రూడ్రైవర్‌తో దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో నిందితుడు పక్క భవనాలపైకి దూకుతూ తప్పించుకునే ప్రయత్నం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: