Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh ఏపీలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానం

ఏపీలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానం

by Satya
ఏపీలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానం

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతోంది. ఇసుక సీనరేజ్ రుసుము ఎవరి వద్ద నుంచీ వసూలు చేయడం లేదు. ఆన్‌లైన్ ద్వారా లోడింగ్, అన్ లోడింగ్ చార్జీలు, రవాణా చార్జీలు మాత్రం చెల్లించి ఇసుక పొందే అవకాశం కల్పించారు. అయితే ఉచిత ఇసుకపై సోషల్ మీడియా వేదిక ద్వారా అసత్య ప్రచారం జరుగుతుండటంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలకు వెనుకాడవద్దని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనాకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా జరుగుతున్న ప్రచారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి బ్రేక్ వేయాలని మీనాను ఆదేశించారు.ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా ఉచిత ఇసుకపై ప్రజల్లో అపోహలు కలిగేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సీఎం మండిపడ్డారు. దీనిపై కలెక్టర్లు, ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీ చేసి, ఈ తరహా పనులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వం నిజాయితీగా అమలు చేస్తున్న శాండ్ పాలసీపై జిల్లా స్థాయిలో నిజానిజాలు వెలికితీసి, తప్పుడు ప్రచారం చేస్తున్న వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని గనుల శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
    తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
  • ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.
    తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
  • హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.
    హైదరాబాద్‌ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్‌ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ…
  • వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.
    ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
  • స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.
    స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: