మూసీ నది పరివాహక ప్రాంతంలోని నివాసితుల ఇళ్ళను కూల్చివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని కేంద్ర మంత్రి, బిజిపి రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంలోని నివాసితులకు భరోసా ఇస్తూ ఇప్పటికే కిషన్ రెడ్డితో సహా బిజెపి నాయకులు పలుమార్లు ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ పర్యటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ పర్యటనలతో ఏం రాదని వారి కష్టాలు తెలియాలంటే వారితో గడపాలని సవాల్ విసిరారు. దీనిని స్వీకరించిన బిజెపి.. బస్తీ నిద్రకు పిలుపునిచ్చింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల వరకు ఈ బస్తీ నిద్ర సాగుతోంది. మూసీ పరివాహక ప్రాంతంలో ఇరవై ప్రాంతాలలో బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఈ బస్తీ నిద్ర చేస్తున్నారు. బిజెపి చేస్తున్న బస్తీ నిద్ర ద్వారా మూసీ పరివాహక ప్రాంత వాసులకు భరోసా కలిగిస్తామంటున్న కేంద్ర మంత్రి, బిజెపి రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డితో మా ప్రతినిధి సత్తిరాజు ఫేస్ టూ ఫేస్….
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 90563