Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Latest News ప్రజాపాలన విజయోత్సవ సభకు ముస్తాబైన ఓరుగల్లు

ప్రజాపాలన విజయోత్సవ సభకు ముస్తాబైన ఓరుగల్లు

by Rama
ప్రజాపాలన విజయోత్సవ సభకు ముస్తాబైన ఓరుగల్లు

రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నప్రజాపాలన విజయోత్సవ సభకు ముస్తాబైన ఓరుగల్లు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఇందిరాగాంధీ జయంతి రోజున ఈ సభ నిర్వహించనుండగా, సభా వేదికకు ‘ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం’గా పేరు పెట్టారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్​గా హాజరు కానుండగా, స్థానిక మంత్రులు కొండా సురేఖ, సీతక్క, వరంగల్​ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి, ఇతర నేతల ఆధ్వర్యంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా వేదికతోపాటు ఇతర ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు, ఇతర నేతలు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దాదాపు లక్ష మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్న నేపథ్యంలో దాదాపు 50 వేల మందికిపైగా మహిళలే బహిరంగ సభకు హాజరయ్యేలా ప్లాన్​ చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హనుమకొండ బాలసముద్రంలో దాదాపు రూ.95 కోట్లతో 4.25 ఎకరాల్లో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వం పదేండ్ల పాటు కళాక్షేత్రాన్ని నిర్లక్ష్యం చేయగా, సీఎం రేవంత్​రెడ్డి సర్కారు ఏర్పడిన పది నెలల్లోనే ఛాలెంజింగ్ గా తీసుకుని దానిని ఓపెనింగ్ కు సిద్ధం చేశారు. అంతేగాకుండా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం ఇక్కడే శిలాఫలకం వేయనున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
    ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
    బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
  • ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
    ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
  • ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.
    ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా హైలెట్‌గా ఉంటుంది: ప్రెస్ మీట్‌లో న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్ స్టార్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: