Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh రామ్ గోపాల్ వర్మ కు బెయిల్

రామ్ గోపాల్ వర్మ కు బెయిల్

by Rama
రామ్ గోపాల్ వర్మ కు బెయిల్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో భారీ ఊరట లభించింది. సోష‌ల్ మీడియాలో టిడిపి,జ‌న‌సేన నేత‌లపై ఆయ‌న పోస్ట్ లు పెట్ట‌డంపై ఎపిలో వివిధ పోలీస్ స్టేష‌న్ ల‌లో ఆయ‌నపై కేసులు న‌మోద‌య్యాయి.. దీనిపై ఆయ‌న హైకోర్టులో ముంద‌స్తు బెయిల్ కోసం పిటిష‌న్ ను దాఖ‌లు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు మొత్తం మూడు కేసులు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎప్పుడు పిలిస్తే అప్ప‌డు పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని, పోలీసుల‌కు పూర్తిగా స‌హ‌క‌రించాల‌ని కండిష‌న్ విధించింది కోర్టు. 2022 సంవత్సరంలో వ్యూహం సినిమా ప్రమోషన్స్లో భాగంగా టీడీపీ, జనసేన అధినేతలతో పాటు నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టారని పలువురు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఫిర్యాదులు రాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆర్జీవీ ని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. విచార‌ణ‌కు గైర్హాజ‌రైన ఆర్జీవి తనపై నమోదైన కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయ‌న‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • కరీంనగర్ జిల్లా ఘన్ముక్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విచిత్ర పరిస్థితి.
    ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. అయితే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ ఉన్నత…
  • అరకులోయలో ట్రైబల్ ఆర్టిజన్ మేళా ఘనంగా ప్రారంభం.
    అడవుల ఒడిలో పుట్టిన గిరిజన ఉత్పత్తులకు దేశవ్యాప్త మార్కెట్‌ దిశగా అరకులోయలో కీలక అడుగు పడింది. గిరిజన కళ, కృషి, సంప్రదాయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో నిర్వహించిన ట్రైబల్ ఆర్టిజన్ మేళా విశేష స్పందన లభిస్తోంది. భారత ప్రభుత్వ…
  • నకిలీ జెమిని టీ పౌడర్ బాక్సులను పట్టుకున్న పోలీసులు.
    మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్‌లోని మహేశ్వర ట్రేడర్స్ నుంచి గోలేటికి అక్రమంగా తరలిస్తున్న నకిలీ జెమిని టీ పౌడర్ బాక్సులను పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుకున్నారు. స్థానిక టోల్ గేట్ వద్ద సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ అక్రమ రవాణా…
  • జూపార్క్ ను సందర్శించిన ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు.
    ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో అసెంబ్లీ వన్యప్రాణి – పర్యావరణ పరిరక్షణ కమిటీ ఏర్పడింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూలాజికల్ పార్క్ ను కమిటీ సందర్శించింది. ఆధునికీకరణ, అభివృద్ధిపై కీలక సమీక్ష నిర్వహించింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడితో పాటు ఎమ్మెల్యేలు…
  • ఇరాన్‍పై అమెరికా రెండో విడత దాడులు.
    పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా సైన్యం మరో విడత భారీ దాడులను ప్రారంభించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల రక్షణే ధ్యేయంగా ఈ దాడులు జరుపుతున్నట్లు అమెరికా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

040934
Total views : 212433

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: