Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టులో విచారణ..

మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టులో విచారణ..

by CVR NEWS

ఖాళీగా ఉన్న మెడికల్‌ పీజీ సీట్ల భర్తీకి కర్ణాటక, మహారాష్ట్రాల్లో ఇచ్చినట్లు సడలింపు ఇవ్వాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్‌పై జస్టిస్‌ పీఎస్‌ నర్సింహ, జస్టిస్‌ అలోక్‌ అరాథే ధర్మాసనం విచారణ చెపట్టింది. ఫిబ్రవరి 28వ తేదీతో కౌన్సెలింగ్‌ ముగిసిందని అప్పటికి ఎపీలో 246 సీట్లు, తెలంగాణలో 377 పీజీ సీట్లు భర్తీ కాలేదని న్యాయస్థానానికి కాలేజీ యాజమాన్యాలు వివరించాయి. ఏపీలో సుమారు 45 కన్వీనర్‌ కోటా సీట్లు కూడా ఉన్నాయని తెలిపారు.
కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని, గడువు ముగియడంతో కౌన్సెలింగ్‌ ముగించారని యాజమాన్యాలు ప్రస్తావించాయి. జాతీయ మెడికల్‌ కమిషన్‌కి సంబంధిత యూనివర్సిటీలు, కాలేజీలు గడువుకు విజ్ఞప్తి చేశాయని పిటిషన్‌లో పేర్కొన్నాయి. అయితే, యాజమాన్యాలు విజ్ఞప్తి చేసినా ఎలాంటి సమాధానం రాలేదని పిటిషనర్ తరపు అడ్వకేట్లు వాదనలు వినిపించారు. మెడికల్ కాలేజీ యాజమన్యాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ధర్మాసనం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. కేసు పూర్తి స్థాయి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

Advertisements

You may also like

Our Visitor

039244
Total views : 194947

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: