Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Latest News గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

by CVR NEWS

గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. లోక్‌సభలో ఆయన మాట్లాడారు. ఆర్థిక అంశాలపై అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నామన్నారు. మనకు ఎక్కువగా గల్ఫ్ నుంచి ముడిచమురు, గ్యాస్ వస్తోందని తెలిపారు. యుద్ధం వల్ల ఇతర దేశాలతో జరిగే వాణిజ్యం దెబ్బతింటోందని వివరించారు. ముడిచమురును సముద్రమార్గం ద్వారానే మనం తెచ్చుకుంటున్నామని అన్నారు.పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చామని పేర్కొన్నారు. భారత్‌కు వచ్చే నౌకలన్నీ హర్మూజ్ జలసంధి నుంచే వస్తాయని తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో దేశ ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ముడిచమురు, ఎల్‌పీజీ గతంలో 27 దేశాల నుంచి దిగుమతి చేసుకునేవారమని, ఇప్పుడు 41 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ప్రధాని మోడీ వివరించారు. దేశంలో ప్రస్తుతం 54 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం మనకు సరిపడా నిల్వలు ఉన్నాయని, ముడిచమురు, గ్యాస్, ఎరువుల రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మన నౌకలు సురక్షితంగా భారత్ చేరేలా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలుపుతున్నామని అన్నారు. ఇక మరోవైపు రైల్వేలో విద్యుదీకరణ వల్ల డీజిల్ వినియోగం బాగా తగ్గిందన్నారు. దేశవ్యాప్తంగా ఈవీ బస్సులు, ఇతర వాహనాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈవీ వాహనాలు భవిష్యత్తులో మరింత పెరిగేలా చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచంలో ఎక్కడ సమస్య వచ్చినా దాని ప్రభావం భారత్‌పై పడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆ ప్రభావం దేశంపై పడకుండా మనం స్వయం సమృద్ధి సాధించాలన్నారు.

Advertisements

You may also like

Our Visitor

023419
Total views : 141973

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.