Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra Pradesh చంద్రబాబు కాన్వాయ్ కుదింపుతో భద్రతా సిబ్బందికి బస్సు..

చంద్రబాబు కాన్వాయ్ కుదింపుతో భద్రతా సిబ్బందికి బస్సు..

by CVR NEWS
చంద్రబాబు కాన్వాయ్ కుదింపుతో భద్రతా సిబ్బందికి బస్సు

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన వాహన శ్రేణిని భారీగా తగ్గించుకున్నారు. తన కాన్వాయ్‌లో ఉండే 12 వాహనాలను కేవలం 4 వాహనాలకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే అమల్లోకి తీసుకొచ్చిన ఆయన, ఈ కొత్త విధానాన్ని ప్రారంభించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్‌తోనే బయలుదేరారు. ఇకపై తన ప్రయాణాలన్నింటికీ ఈ కుదించిన కాన్వాయ్‌నే వినియోగించాలని ఆయన నిర్ణయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా తమ వాహన శ్రేణిని తగ్గించుకుని ఇంధనాన్ని ఆదా చేయాలని, తద్వారా ప్రజాధనం వృథాను అరికట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి సూచనతో పలువురు మంత్రులు కూడా తమ కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకున్నట్లు సమాచారం.

Advertisements

You may also like

Our Visitor

039801
Total views : 200857

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: