Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana సింగరేణి కార్మికులకు శుభవార్త.

సింగరేణి కార్మికులకు శుభవార్త.

by CVR NEWS
సింగరేణి కార్మికులకు శుభవార్త

సింగరేణి మెడికల్ బోర్డును అత్యంత పారదర్శకంగా, వివాదరహితంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. వివిధ కారణాల వల్ల కొద్దికాలంగా నిలిచిపోయిన ఈ మెడికల్ బోర్డు ప్రక్రియను అతి త్వరలోనే యథావిధిగా పునఃప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎలాంటి అక్రమాలు, అవకతవకలు, మోసాలకు తావులేకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించారు. అర్హులైన కార్మికుల వారసులకు కారుణ్య నియామకాల రూపంలో ఉద్యోగ అవకాశాలు త్వరగా అందేలా చర్యలు చేపట్టాలన్నారు భట్టి విక్రమార్క. నేడు మంచిర్యాలలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో 335 మంది వారసులకు కారుణ్య నియామక పత్రాలను స్వయంగా అందజేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు. ఇటీవల కోల్ బెల్ట్ ప్రాంత మంత్రులు, శాసనసభ్యులతో జరిగిన సమావేశంలో వ్యక్తమైన కార్మికుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

023258
Total views : 141674

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.