Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Andhra Pradesh తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

by CVR NEWS
తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లడంతో ప్రత్యామ్నాయంగా మరో టీచర్‌ను నియమించకపోవడంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు.ప్రస్తుతం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లగా.. డిప్యూటేషన్‌పై మరో ఉపాధ్యాయుడిని నియమించకపోవడంతో గ్రామస్తులు, విద్యార్థులు పాఠశాల వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గ్రామస్తులతో చర్చించి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.పాఠశాలలో పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహించాలని, ఉపాధ్యాయుల కొరతను వెంటనే తీర్చాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీసీ నాయకులతో కలిసి జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: