52
గుజరాత్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘భారత్ ట్యాక్సీ’ సేవలను ప్రారంభించారు. కోఆపరేటివ్ మోడల్‌లో డ్రైవర్లే భాగస్వాములుగా ఉండే ఈ ట్యాక్సీ సేవలను ఆవిష్కరిస్తూ అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ట్యాక్సీ సేవలు ప్రజల నిత్యావసరంగా మారాయని.. రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 500 నగరాలకు భారత్ ట్యాక్సీ సేవలను విస్తరిస్తామని తెలిపారు. ప్రైవేట్ రైడ్ హైలింగ్ యాప్‌లు కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నాయని విమర్శించిన ఆయన, భారత్ ట్యాక్సీలో అలాంటి పరిస్థితులు ఉండవని హామీ ఇచ్చారు. ఇప్పటికే 7 లక్షల మంది డ్రైవర్లు ఈ యాప్‌లో భాగస్వాములయ్యారని, వినియోగదారులు, డ్రైవర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు.






Total views : 180172