పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంపై మరోసారి అనిశ్చితి ఏర్పడింది. ఇరాన్‌పై భీకర దాడులతో విరుచుకుపడింది అమెరికా. ప్రతీకార దాడులకు దిగింది. హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా యూఎస్ తాజాగా దాడులు చేపట్టింది. హర్మూజ్‌కు సమీపంలోని ఇరాన్ మిలటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. ఇరాన్‌కు చెందిన క్షిపణి, డ్రోన్, రాడార్ సైట్లపై తమ యుద్ధవిమానాలు దాడులు చేశాయని వెల్లడించింది అమెరికా. ఇదిలా ఉంటే..ఇరాన్‌పై ప్రతీకార దాడికి ముందు స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..హర్మూజ్‌లో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడి చేయడం తెలివి తక్కువ పనేనని విమర్శించారు. దీనికి అమెరికా బదులు తీర్చుకుంటుందని పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటన వెలువడిన అనంతరం అమెరికా యుద్ధవిమానాలతో దాడులకు దిగింది. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇటీవలే అమెరికా-ఇరాన్ మధ్య శాంతిఒప్పందం కుదిరింది. అయితే తాజా దాడులతో ఒప్పందం మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది.
ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంపై మరోసారి అనిశ్చితి.
49
previous post





Total views : 180109