35
తెలంగాణవ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బోరబండ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో రాష్ట్రస్థాయి పోలియో నిర్మూలన కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. రాష్ట్రంలో సుమారు 42 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ రూపొందించిందని స్పష్టం చేశారు.





Total views : 180104