Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Latest News నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మంత్రి జూపల్లి పర్యటన.

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మంత్రి జూపల్లి పర్యటన.

by CVR NEWS
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మంత్రి జూపల్లి పర్యటన

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. అనంతరం అర్హులకు పట్టాలను పంపిణీ చేశారు. అలాగే పురాతన మహాదేవుని ఆలయ చెరువు సుందరీకరణకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, గృహాల పంపిణీ, మహిళల సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ముధోల్ నియోజకవర్గంలో గంజాయి, గుట్కా వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

035664
Total views : 180109

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.