Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం.

by CVR NEWS
సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా సచివాలయంలో కీలక అడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 19వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్‌గా మార్చడమే ధ్యేయంగా సాగిన ఈ సమావేశంలో భారీ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసే దిశగా అడుగులు పడ్డాయి. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఆయా శాఖల ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీలో పారిశ్రామిక విప్లవానికి కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో సచివాలయంలో 19వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు వీలుగా పలు కీలక రంగాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.ముఖ్యంగా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖల పరిధిలోని పలు ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాబోయే రోజుల్లో ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చడమే లక్ష్యంగా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా.. మొత్తం 9 వేల 76 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 11 మెగా ప్రాజెక్టులపై ఈ ఎస్ఐపీబీ సమావేశంలో సమగ్రంగా చర్చించి ఆమోద ముద్ర వేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

038925
Total views : 192875

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: