Thursday, October 15, 2026
News Navigation
Thursday, October 15, 2026
News Navigation

Breaking

Thursday, October 15, 2026
Home Andhra Pradesh నర్సీపట్నంలో అభివృద్ధి పరుగులు.

నర్సీపట్నంలో అభివృద్ధి పరుగులు.

by CVR NEWS

నర్సీపట్నం పట్టణంలోని 28వ వార్డులోని అయ్యన్న కాలనీలో రెండు కోట్ల 28 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, కాలువల పనులను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి, టీడీపీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలో గత పది రోజులుగా రోడ్లు, డ్రైన్లు వంటి 189 అభివృద్ధి పనులను ప్రారంభించామని.. మరో 15 రోజుల్లో ఈ ఓపెనింగ్స్ అన్నీ పూర్తవుతాయని తెలిపారు. నర్సీపట్నం మున్సిపాలిటీకి 32 కోట్లు రూపాయలు కేటాయించి పనులు చేపడుతున్నామని, మొత్తంగా 242 కోట్లరూపాయలతో పట్టణాభివృద్ధి జరుగుతోందని వివరించారు. రాబోయే ఏడాదిన్నరలో ఇంటింటికి కుళాయి అందించేందుకు 185 కోట్ల రూపాయలతో మంచినీటి పథకం అమలు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అలాగే పట్టణంలో 1075 వీధిలైట్లు రిపేర్ చేయించి, 700 కొత్త లైట్లు, 140 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశామని, అయ్యన్న కాలనీకి సైతం ఎలక్ట్రికల్ పోల్స్ అందించామని వెల్లడించారు. పట్టణంలోని చెత్త సమస్య పరిష్కారానికి, డంపింగ్ యార్డ్ నుండి చెత్తను జిందాల్ కంపెనీకి తరలించేందుకు రూ. 2 కోట్లు, ప్రాసెసింగ్ యూనిట్ కోసం రూ. 3.05 కోట్లు కేటాయించినట్లు ఆమె స్పష్టం చేశారు.

గతంలో సరైన రోడ్లు లేని అయ్యన్న కాలనీలో గత రెండేళ్లుగా ఎన్నో మార్పులు తీసుకువచ్చామని, యువతకు నాలుగు లక్షల రూపాయల నిధులు తోటి వాలీబాల్ కోర్టుతో సహా అనేక సదుపాయాలు కల్పించామని ​ టీడీపీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ అన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల కంటే అత్యధికంగా 28వ వార్డుకే 2.28 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు తెలిపారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో పట్టణాభివృద్ధికి రూ. 242 కోట్లు, మంచినీటి సదుపాయానికి రూ. 185 కోట్లు వచ్చాయని గుర్తుచేశారు. అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, రాబోయే మూడేళ్లలో కాలనీలో ఎలాంటి పెండింగ్ పనులు లేకుండా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

నర్సీపట్నంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రూ.2.28 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను చింతకాయల పద్మావతి, చింతకాయల రాజేష్ ప్రారంభించారు. మున్సిపాలిటీలో ఇప్పటికే 189 అభివృద్ధి పనులు ప్రారంభించామని, మొత్తం రూ.242 కోట్లతో పట్టణాభివృద్ధి చేపడుతున్నట్లు పద్మావతి తెలిపారు. తాగునీరు, వీధిలైట్లు, పారిశుద్ధ్యానికి కూడా భారీ నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: