Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Andhra Pradesh లక్ష్మీదేవిపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ప్రదేశం పరిశీలన.

లక్ష్మీదేవిపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ప్రదేశం పరిశీలన.

by CVR NEWS

అనకాపల్లి జిల్లా కేంద్రంలో గత 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న లక్ష్మీదేవిపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మళ్లీ కదలిక వచ్చింది. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ప్రదేశాన్ని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పరిశీలించారు.గత రెండు దశాబ్దాలుగా బ్రిడ్జి నిర్మాణం పూర్తికాకపోవడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు తెలిపారు. ప్రభుత్వాలు మారడం, నిర్మాణ వ్యయం పెరగడం, రైల్వే జోన్ ఏర్పాటుతో అధికారుల మార్పులు వంటి పలు కారణాలతో పనులు ఆలస్యమయ్యాయని ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు.ఇక ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే టెండర్లు పిలిచి.. సుమారు 90 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. పనులు ప్రారంభమైన తర్వాత 18 నెలల్లో బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: