Wednesday, September 23, 2026
News Navigation
Wednesday, September 23, 2026
News Navigation

Breaking

Wednesday, September 23, 2026
Home Andhra Pradesh ఉత్తరాంధ్రపై తీవ్ర వాయుగుండం ప్రభావం.

ఉత్తరాంధ్రపై తీవ్ర వాయుగుండం ప్రభావం.

by CVR NEWS

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మరింత కలవరం రేపుతోంది..! ఆంధ్రప్రదేశ్‌ ఉత్తర తీరాన్ని వణికించేందుకు దూసుకొస్తోంది తీవ్ర వాయుగుండం..! గడిచిన ఆరు గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ.. ప్రస్తుతం కళింగపట్నానికి కేవలం 100 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది..! బుధవారం రాత్రికి విశాఖపట్నం–గోపాల్‌పూర్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది..! ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ అయింది. శ్రీకాకుళం నుంచి విశాఖ వరకు భారీ వర్షాలు కొనసాగుతున్నాయి..!
ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు.. రాబోయే గంటల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: