Wednesday, September 23, 2026
News Navigation
Wednesday, September 23, 2026
News Navigation

Breaking

Wednesday, September 23, 2026
Home Latest News కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఇవాళ ఎథిక్స్ కమిటీ భేటీ.

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఇవాళ ఎథిక్స్ కమిటీ భేటీ.

by CVR NEWS

తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ కీలకంగా సమావేశం కానుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై కమిటీ మరోసారి చర్చించనుంది. అసెంబ్లీలో మార్చి నెలలో జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కౌశిక్ రెడ్డి అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై స్పీకర్‌ ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయగా.. కమిటీ కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. తొలుత సెప్టెంబర్ 19న సమావేశం కావాల్సి ఉండగా.. కౌశిక్ రెడ్డి వివరణపై కమిటీ అసంతృప్తిగా ఉందన్న నేపథ్యంలో భేటీ వాయిదా పడింది. తాజాగా ఇవాళ కమిటీ సమావేశం కానుంది. పార్కల్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కౌశిక్ రెడ్డి ఇచ్చిన వివరణ, ఆయనపై వచ్చిన ఆరోపణలు, తదుపరి చర్యలపై చర్చించే అవకాశం ఉంది. కమిటీ ఏం సిఫార్సు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే తుది నిర్ణయం కమిటీ చర్చ అనంతరం వెల్లడికానుంది.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: