చిత్తూరు జిల్లా.. గంగవరం మండలానికి చెందిన ఇద్దరు చిన్నారులు మాజీ మంత్రి అమర్నాథరెడ్డి (Amarnath Reddy) పై తమ వెలకట్టలేని అభిమానాన్ని చాటుకున్నారు. ఆ చిన్నారుల కోరిక మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. వివరాల్లోకెళ్తే… గంగవరం మండలం మేలుమాయి పంచాయతీలోని గుండ్లపల్లి గ్రామంలో మాజీ మంత్రి అమరనాథ రెడ్డి నాలుగు నెలల క్రితం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన జయరామి రెడ్డి కుమార్తెలు గీతిక మరియు షాలినీలు తమ పొదుపు చేసి దాచుకున్న (కిడ్డి బ్యాంకు) హుండీ సొమ్మును ఆయనకు అందించి ఈ సొమ్మును నామినేషన్ కొరకు వాడుకోవాలని కోరారు. దీంతో చిన్నారులు అభిమానంగా అందించిన ఆ హుండీని దేవాలయంలో పూజల అనంతరం పగలగొట్టి అందులోని రూ.4701 సొమ్మును నామినేషన్ దరఖాస్తు సొమ్ము కొరకు వాడుకొని ఆ చిన్నారుల కోరికను తీర్చారు. ఈ అంశాన్ని చూసిన పలువురు ఓ వైపు చిన్నారుల అభిమానం వెలకట్టలేనిదైతే, ఆ అంశాన్ని నాలుగు నెలల తర్వాత కూడా గుర్తుంచుకొని మాజీ మంత్రి వారి కోరికను తీర్చడం గొప్ప విషయమని కొనియాడారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కోనసీమ జిల్లాలో ప్రజలకు ఇబ్బందిగా మారిన వంతెన పనులు.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దిండి-చించినాడ మధ్య వశిష్ఠ గోదావరిపై ఉన్న వంతెన మరమ్మత్తు పనులు ప్రజలకు ఇబ్బందిగా మారాయి. గోదావరిపై ఉన్న వంతెనకు గత సుమారు పది నెలలుగా మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి.మరో వారం రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం నుంచి…
- ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో ఈడీ విచారణ.ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన వందల కోట్ల మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా నాంపల్లి ప్రత్యేక కోర్టు అనుమతితో కీలక నిందితులైన ఏపీ బేవరేజెస్…
- చిత్తూరు జిల్లా పలమనేరులో టిడ్కో గృహ బాధితులకు ఊరట.చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో గతంలో టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకుని, నగదు జమ చేసినప్పటికీ ఇళ్లు రాక ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులకు ఎట్టకేలకు ఊరట లభించింది. అర్హత ఉండి గృహాలు దక్కని లబ్ధిదారులకు, వారు చెల్లించిన నగదును…





Total views : 214622