కడప జిల్లా… వేంపల్లి పట్టణంలోని బిడాలమిట్ట కు చెందిన షేక్ మదార్ షావల్లి(18) సయ్యద్ కాశీం బాష (35) సయ్యద్ అబ్బు (32). అనే ముగ్గురు వ్యక్తులకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. వీరు నిత్యం బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం పాములూరులో బేల్దారి పని చేసి భోజనానికి వేంపల్లె కు వచ్చి తిరిగి పాములూరు కు వెళుతుండగా పులివెందుల – కడప బైపాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108లో వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వేంపల్లె ఎస్ ఐ తిరుపాల్ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Kadapa
పట్టపగలే ఓ ఇంట్లో దొంగలు చోరీ చేశారు. ఈ ఘటన కడప జిల్లా వేంపల్లి పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని స్థానిక చైతన్య హైస్కూల్ వీధి సమీపంలో సింగారెడ్డి అమర్నాథ్ రెడ్డి నివాసం ఉంటున్నాడు. ఇవాళ ఆయన తల్లి నాగసుబ్బమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన గుర్తు తెలియని దొంగలు చోరీ చేసినట్లు బాధితుడు తెలిపారు. నాగసుబ్బమ్మను కొట్టి, ఇంట్లో ఉన్న బాత్రూంలో ఆమెను పడేసి, ఆమె మెడలోని గొలుసు, గాజులు దొంగలు లాక్కుపోయినట్లు బాధితుడు పేర్కొన్నారు. దాదాపు 14 తులాలు బంగారు చోరీ అయినట్లు బాధితుడు తెలిపారు.ఈ ఘటనపై వేంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు అమరనాథ్ రెడ్డి తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. పట్టపగలే చోరీ జరగడంతో చుట్టుపక్కల గృహయజమానులు భయాందోళనకు గురవుతున్నారు.
అక్రమ కేసులో జైలుకు వెళ్లిన ప్రొద్దుటూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డికి కండిషన్ బెయిల్ మంజూరు అయింది. వైసిపి కార్యకర్త బెనర్జీ పై జరిగిన దాడి కేసులో నమోదైన హత్యాయత్నం కేసుకు సంబంధించి ప్రవీణ్ కుమార్ రెడ్డిని మూడవ నిందితునిగా అరెస్టు చేశారు. ఈనెల 13న ప్రవీణ్ ను అతని నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి కడప కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం కడప కేంద్ర కారాగారం నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి విడుదలయ్యారు. ప్రవీణ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ నాయకులు,కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చెయ్యని నేరానికి అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారని తెలిపారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేస్తున్న అక్రమాలను.. అవినీతిని.. అరాచకాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళుతున్నానని… నాపై హత్యాయత్నం కేసు బనాయించి జైలుకు పంపారని ఆయన అన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి నాకు సంబంధం లేనటువంటి కేసులో ఇరికించారని ప్రవీణ్ తెలిపారు. ఎమ్మెల్యే నాపై ఎన్ని కేసులు పెట్టించినా… ఆయన చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని… వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరులో టిడిపి జెండా ఎగరవేస్తామని ప్రవీణ్ స్పష్టం చేశారు
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డు మార్గం లోనున్న ప్రధాన రహదారికి కూతవేట దూరంలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ దేవాలయం గర్బ గుడిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అమ్మవారి విగ్రహం తో పాటు చీరలు, పూజా సామాగ్రి హుండీలు పూర్తిగా అగ్నికి ఆహుతై బుడిదగా మారాయి. అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనను అమ్మవారి దర్శనార్థం పూజకు వెళ్ళిన అయ్యప్ప స్వాములు దర్మకర్త రామ మూర్తికి తెలియజేశారు. వారు జరిగిన సంఘటనను పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకొన్న డిఎస్పి మహబూబ్ బాషా, అర్బన్ సి ఐ సుధాకర్ రెడ్డి వారి సిబ్బంది తో కలిసి హుటా హుటిన ప్రమాద సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. అగ్ని ప్రమాదం కు గల కారణాల పై అరా తీసారు. అదే విదంగా మాజీ ఎంపి సుగావాసి పాలకొండ్రాయుడు గారు కుడా గంగమ్మ ఆలయంలో జరిగిన అగ్ని ప్రమాదం ను తెలుసుకొని ఆలయం కు చేరుకొన్నారు. కావాలనే ఉద్దేశపుర్వకంగా నిప్పు పెట్టినట్లు తెలిస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే ఉండదన్నారు. అయితే ధర్మ కర్త పూజారి అయినటువంటి రామ మూర్తి మాత్రం ఇది సాధారణ ప్రమాదం కాదని ఉద్దేశపుర్వకంగానే అమ్మవారి గర్బగుడికి నిప్పు పెట్టి ఉంటారని వారు ఆరోపించారు. ఆలయ ధర్మ కర్త ఇచ్చిన పిర్యాదు మేరకు ప్రమాదమా లేక ఎవ్వరైనా ఉద్దేసపుర్వకంగా నిప్పు పెట్టారా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని అర్బన్ సి ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు.
మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ.. ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. నాలుగు రోజుల క్రితం కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నుంచి ప్రారంభించిన పాదయాత్ర బుధవారం ప్రొద్దుటూరు చేరుకుంది. రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడుగా ఉన్న గుంటూరు జిల్లా వాసి కట్టెపోగు బసవరావు ఆ పదవికి రాజీనామా చేసి పాదయాత్ర చెపట్టారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ.. మళ్లీ 2024లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని 2000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేపట్టారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జరిగే ఈ పాదయాత్ర మూడు నెలలు కొనసాగు తుందని ఆయన చెప్పారు. పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర ప్రొద్దుటూరుకు చేరుకుంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని కలిసిన అనంతరం 5వ రోజు పాదయాత్ర ప్రొద్దుటూరు పాత బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పాదయాత్ర ప్రారంభం అయ్యింది. ఆయనకు మద్దతుగా ప్రొద్దుటూరు మండల అధ్యక్షుడు సానబోయిన శేఖర్ యాదవ్, రాజుపాలెం మండలం వైసిపి అధ్యక్షుడు రాజారాం రెడ్డి వైసిపి నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు.
Read Also..
జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవదన్నారు డిఎస్పి మహబూబ్ బాషా .అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం లో గత నెలలో చిన్న బిడికి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో దొంగతనానికి పాల్పడిన శ్రీ సత్య సాయి జిల్లాకు చెందిన నీలమాలప్ప,కర్ణాటక రాష్ట్రం కు చెందిన ఆవుల రామకృష్ణ, అన్నమయ్య జిల్లాకు చెందిన మల్లికార్జున లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఆరు కేజీలు బరువు గల నాలుగు వెండి అచ్చులు,ఎనిమిది గ్రాముల బరువు గల మూడు బంగారు తాలి బోట్లు, రూ.10 వెలు నగదు తొ పాటు ఒక పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకొన్నట్లు వారు తెలియజేశారు .అరెస్ట్ చేసిన వారి పై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు వారు పేర్కొన్నారు .విరి పై గతంలో రాయచోటి అర్బన్, పీలేరు తో పాటు నందలూరు పోలిస్ స్టేషన్ లలో కుడా దొంగతనం క్రింద కేసులు నమోదై ఉన్నట్లు వారు వెల్లడించారు .చోరి కేసును నమోదు చేసి నెలలోనే నిందుతులను అరెస్ట్ చేయడంలో ఉత్తమ విధులు నిర్వర్తించిన రాయచోటి రురల్ సీఐ తులసి రామ్ ,యస్ ఐ రామకృష్ణా రెడ్డి వారి సిబ్బందిని డిఎస్పి అభినందించ్చారు
అన్నమయ్య జిల్లా.. రాయచోటిలో అన్నదాతలకు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ లక్ష్యం అని అన్నారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణానికి సంబంధించి 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ను విద్యుత్ శాఖ ఒస్డీ శ్రీనివాసులు, పర్యవేక్షణ ఇంజినీర్ రమణ, జేసి పరహన్ అహమ్మద్ లతో కలిసి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ లు ప్రారంబించారు. వీరికి సంబేపల్లి మండలం సర్పంచ్, వైకాప నాయకులూ, కార్యకర్తలు పుస్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు విద్యుత్ శాఖ ద్వారా ఎన్నో అద్బుతాలు చేయగలిగామన్నారు. అడిగిన ప్రతి రైతుకు ట్రాన్స్ ఫార్మర్ పెట్టగలుగుతున్నాం. సామాన్య రైతులకు ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలంటే డబ్బులు, సిపారసుల తో ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితులు. జగన్ మోహన్ రెడ్డి సిఎం అయిన తర్వాత రాయచోటి నియోజకవర్గం వ్యాప్తంగా 15 వేల కనెక్షన్ లు వుంటే ఈ నాలుగన్నర సంవత్సరకాలంలో సుమారు 6 వేల పైగా కనెక్షన్ లు ఇవ్వగాలిగాం అన్నారు. ఐదు వేలకు పైగా అన్నదాతలకు ట్రాన్స్ ఫార్మర్లు ఇవ్వగాలిగామన్నారు. గతంలో పాలకులు ఇదు సవత్సరాలు పరిపాలన చేసి కేవలం 18 వందల ట్రాన్స్ ఫార్మర్లు కుడా ఇవ్వలేకపోయారు. అదే విదంగా జగనన్న లే అవుట్ నందు జిల్లా కలెక్టర్ చొరవతో అన్ని రకాల వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. పట్టణంలో కానీ, మండలాలలో కానీ విద్యుత్ సమస్యలు లేకుండా ప్రజలకు అన్నదాతలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందజేస్తున్న విద్యుత్ శాఖ అధికారులకు, సిబ్బందికి ఎమ్మెల్యే.. కలెక్టర్ లు ప్రత్యెక అభినందనలు తెలియజేశారు.
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నారాయణ రెడ్డి గారి పల్లి గ్రామం కొండవాండ్ల పల్లెకు చెందిన అర్ అనుసూయ నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోంది. గత కొన్ని నెలలుగా అనారోగ్యం తో బాధపడుతున్న అనుసూయ ఈ రోజు ఉదయం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరి వేసుకొని మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడం తో సంఘటన స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలను వారి కుటుంబ సభ్యలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈమెకు భర్త వెంకటరమణ తో పాటు ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు వున్నారు.
కడప జిల్లా… సీఎం జగన్ అబద్ధపు ప్రకటనలు, మాయమాటలతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. కడపజిల్లా ప్రొద్దుటూరు సుందరయ్య కాలనీలోని 160 కుటుంబాలు బీజేపీలో చేరడంతో సత్య కుమార్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్రం రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే మూడు లక్షల ఇళ్లు మాత్రమే కట్టేమని వైసీపీ ప్రభుత్వం చెబుతోందని అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదన్నారు. పేదలకు మంచి చేయలేదు కాబట్టే జగన్ పరదాల చాటున తిరుగుతున్నారన్నారు. పేదల కోసం కేంద్రం ఇస్తున్న బియ్యాన్ని కూడా స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడెక్కడ ఉన్న భూములను కబ్జా చేస్తున్నారని అయన విమర్శంచారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం గున్నికుంట్ల బైపాస్ రోడ్ నందు నున్న జడ్పి క్యాంపు కార్యాలయంలో శాసన సభ వ్యవహారాల సమన్వయ కర్త,స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లోనే నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. యువత విద్యలో, నైపుణ్యంలో పురోగతి సాధించేందుకు రాయచోటి పట్టణంలో పరిశ్రమలు, పీజీ కేంద్రం, యునాని మెడికల్ కాలేజీ ల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు జరిగిందన్నరు. వృత్తి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 2న రాయచోటిలో మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. 100 కంపెనీలు పాల్గొని 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 15వేల నుంచి 50 వేల వరకు జీతాలు కల్పించే అవకాశం ఉంటుందన్నారు. పది నుంచి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాష,స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్యాంసుందర్ ,చిన్నమండెం మండలం ఎంపీడీవో దివ్య తదితరులు పాల్గొన్నారు..




Total views : 194277