బీటెక్ రవి అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని. ఎఫ్ఐఆర్ లో 324 సెక్షన్ పెట్టి రిమాండ్ రిపోర్ట్ లో 333 సెక్షన్ కు మార్చాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించారు MLC భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి. పది నెలల నుంచి రవి అందుబాటులో లేనందున అరెస్ట్ చేయలేదని పోలీసులు చెప్పడం సిగ్గుచేటని అందుబాటులో లేని వ్యక్తి పది రోజుల క్రితం జిల్లా ఎస్పీని ఎలా కలిసాడన్నారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి.
Kadapa
కడప జిల్లా.. ఇడుపులపాయ ట్రీపుల్ ఐటీ లోని బాయ్స్ హాస్టల్- 2 లో కొండచిలువ కలకలం రేపింది.. మంచం కింద దాక్కొని ఉన్న కొండచిలువలను విద్యార్థులు గుర్తించారు. ట్రిపుల్ ఐటీ అధికారులకు విద్యార్థులు సమాచారం తెలిపారు. వేంపల్లి ఫారెస్ట్ అధికారులు ట్రీపుల్ ఐటీ అధికారుల సమాచారంతో ఘటనా స్థలం వద్దకు చేరుకొని గోన సంచిలో కొండచిలువను బంధించి ఫారెస్ట్ జీప్ లో తీసుకుపోయి ఫారెస్ట్ లో విడిచిపెట్టారు. భయాందోళనతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు.
Read Also..
నాలుగున్నర ఎల్ల తర్వాత సీఎం జగన్ కి వరికేపూడిసెల గుర్తొచ్చిందా… ఆరు నెలల ముందు శంకుస్థాపన చేసే ఏ ప్రాజెక్టుని కూడా నమ్మకండి అని గతంలో జగన్ అనేక సభలలో చెప్పాడు… రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది… కేవలం ఎన్నికల కోసమే ఈరోజు వరికేపూడిసెల శంకుస్థాపన… పల్నాడు రైతులను ఎమ్మెల్యేలు నిలువునా మోసం చేశారు… ఒక్క రూపాయి విడుదల చేయకుండా ప్రాజెక్టుని ఎలా కడతారు… గతంలో మీ నాన్న ఇదే ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి వదిలేశారు… టీడీపీ ప్రభుత్వ హయాంలో 340 కోట్లు విడుదల చేశాము… చంద్రబాబు ఇచ్చిన 340 కోట్ల నిధులలో ఒక్క రూపాయి అయినా వైసీపీ నేతలు కర్చుపెట్టలేదు… దేశంలో అతి పెద్ద మోసగాడు ఒక్క జగన్ మోహన్ రెడ్డి మాత్రమే… వరికెపూడిసెలపై సీఎం జగన్ చెప్పేవన్ని పచ్చి అబద్ధాలే… పల్నాడులో రైతు కళ్ళ ముందే నిలువునా పంటలు ఎండిపోతున్నా,జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కనీసం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు… మంత్రి అంబటి రాంబాబుకి ఏమాత్రం సిగ్గు ఉన్నా సరే వెంటనే రాజీనామా చేయాలి…
పది నెలల క్రితం కడప విమానాశ్రయం వద్ద పోలీసులతో వాగ్వాదం, ఆందోళన చేపట్టిన కేసులో అరెస్టయ్యిన టీడీపీ నేత మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డికి కడప కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. వ్యక్తిగత పనిమీద పులివెందుల నుంచి కడప వెళ్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని వల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాత్రి 10 గంటల సమయంలో కడప ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించిన అనంతరం కడపలో జడ్జి ఎదుట హాజరుపరిచారు. దీంతో బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుండగా బీటెక్ రవి అరెస్టుపై కడప డీఎస్పీ షరీఫ్ వివరాలు వెల్లడించారు. విమానాశ్రయం వద్ద జరిగిన తోపులాటలో తమ ఏఎస్ఐకి గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేశామని, బీటెక్ రవి అందుబాటులో లేకపోవడంతో మంగళవారం అరెస్టు చేసినట్టు వివరించారు.
బీటెక్ రవిని వైద్య పరీక్షల కోసం రిమ్స్ కు తరలించిన పోలీసులు…
గతంలో నారా లోకేష్ కడప జిల్లా పర్యటనలో భాగంగా కడప ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటనలో మాజీ టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి పై కేసు నమోదు…
ఎయిర్ పోర్ట్ లోకి తనను అనుమతించలేదంటూ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన బీటెక్ రవి పై అప్పట్లో వల్లూరు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసారు.
ఈరోజు పులివెందుల నుంచి కడపకు వస్తున్న సమయంలో పెండ్లిమర్రి మండలం కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కు సమీపంలో బీటెక్ రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… అనంతరం వల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలింపు…అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం కడప రిమ్స్ కు తరలించిన పోలీసులు…
వ్యక్తి గత మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన షేర్ చేసే వారి పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అన్నమయ్య జిల్లా ఎస్పి కృష్ణ రావు ఇపిఎస్ .అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి ఎస్పి కార్యాలయంలో వారు రాజంపేట డిఎస్పి తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పుల్లంపేట మండలం వత్తులురు గ్రామానికి చెందిన చింతా సుదర్శన్ పై క్రైమ్ నెంబర్ .309 /203 U/S 153(A),505 IPC కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. ఇతను భి ఫార్మసి పట్టుభద్రుడని తెలంగాణ రాష్త్రం హైదరాబాద్ లో కొన్ని ఫార్మా కంపెనీలలో ఉద్యోగం చేస్తు జీవనం సాగించే వారు. ఇతను అనారోగ్యం కారణంగా గత ఏడాది నుంచి రాజంపేటలో నివాసం ఉంటున్నట్లు మా విచారణలో తేలిందన్నారు. ఆరు నెలల క్రితం ఒక టిడిపి అనుచరుడితో పరిచయం ఏర్పరచుకొన్నారు. అతని ద్వారా వాట్సప్ గ్రూప్ నందు మెంబర్ గా చేరాడు. నిందుతుడు ప్రతి రోజు కుడా సుమారు 150 సభ్యులకు అసబ్యకరమైన పోస్టులను షేర్ చేస్తుండేవాడు. అందుకోసం అతనికి ప్రతి నేలా ఎనిమిది వేల రూపాయలు జీతం చెల్లించే వారు. తమను ఎవరూ ఏమీ చేయలేరన్నట్లుగా వ్యవహరిస్తున్న వీరిని కొందరు ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇలాంటి వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా. నకిలీ ఖాతాలు, మారుపేర్లతో పోస్టులు పెట్టేవారిని గుర్తించే సాంకేతికత తమ దగ్గర ఉందన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర, అశ్లీల, అవమానకర పోస్టులపై యుద్ధం ప్రకటించామని.. అలాంటి పోస్టులు పెట్టేవారిపై గతంలో కంటే తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు. ఏదో ఒక రాజకీయ పార్టీపై అభిమానంతో భవిష్యత్తును పాడు చేసుకోవద్దని వారు హితవు పలికారు.
కడప జిల్లాలో గత నెలలో YCP నాయకుడు బెనర్జీ పై జరిగిన హత్యాయత్నం కేసులో టిడిపి ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి నివాసం వద్ద నుంచి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా వెళ్లారు. బెనర్జీ హత్యాయత్నం కేసులో సంబంధంలేని నన్ను అరెస్టు చేయడం ఏమిటి అని ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు..ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బెనర్జీ అనే వ్యక్తిపై భరత్ రెడ్డి చేసిన దాడి అనుకోకుండా జరిగినది. దాడిలో పాల్గొన్న భరత్ రెడ్డి నా తమ్ముడు, రామ్మోహన్ రెడ్డి నా బంధువు అని, బెనర్జీ ఒక అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతున్నాడని ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని భరత్ రెడ్డికి చెప్పుకుందని, ఈ విషయం బెనర్జీ కి తెలిసి అమ్మాయి విషయంలో తలదూర్చకూడదని భరత్ ను పలుమార్లు బెదిరించాడన్నారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి వెంట టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు.
ఓ షాప్ ఎదుట అడ్డంగా కారు పెట్టి ఎంతసేపటికి రాకపోవడంతో ఆ కారును నడి రోడ్డు పైకి తోయడంతో సుమారు ఒక గంట వరకు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడిన సంఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం యస్ యన్ కాలని గున్నికుంట్ల రోడ్డు ప్రధాన రోడ్డు పై చోటు చేసుకోంది. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్ వేరే ఉద్యోగి పట్టణంలోని యస్ యాన్ కాలని లో తన అత్త గారి ఇంటికి ఆదివారం రాత్రి రావడం జరిగింది .తన అత్తగారి ఇంటికి కారు పొయ్యే సౌకర్యం లేక పోవడంతో సమీపంలోని ఓ షాప్ ఎదుట పార్కింగ్ చేశారు అతని కారును .కానీ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలు అయినప్పటికీ ఆ కారును అక్కడ నుంచి తియకపోవడంతో ఆ షాప్ యజమాని తన గుమస్తాలతో కలిసి నడి రోడ్డు పైకి తోయడం జరిగింది .దీంతో వాహనదారులు తో పాటు పాదచారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది .దీంతో కారును ఒక ఆటోకు కట్టి పక్కకు పెట్టె ప్రయత్నం చేస్తుండగా కారు యజమాని అక్కడికి చేరుకొన్నారు .వెంటనే కారు ను కారు యజమానితో పాటు షాప్ యజమానిని ట్రాఫిక్ కార్యాలయానికి తీసుకువెళ్ళారు .వారికీ మందలించి పంపిచ్చినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు
పటాకులు మిరగల్లు పడి పశుగ్రాసం వరి గడ్డి దగ్దమైన సంఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం కొత్తపేట రామాపురం ధర్మారెడ్డి విధి నందు చోటు చేసుకోంది.దీంతో సమాచారం అందుకొన్న అగ్నిమాపక అధికారి వెంకట్రామి రెడ్డి అద్వర్యంలో హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకొన్నారు .మంటలను అదుపులోకి తీసుకువచ్చారు .వారు తెలిపిన వివరాల మేరకు ధర్మా రెడ్డి విధికి చెందిన రాజమ్మ ,సహదేవ రెడ్డి లు కొత్తపేట రామాపురం లో నివాసం ఉంటూ కొన్ని పసువులను (గేదలను )మేపుకొంటు జీవనం సాగిస్తున్నారు .గేదలకు కావాల్సిన పశు గ్రాసం ను సుమారు లక్ష రూపాయలు వెచ్చించి ఎనిమిది లోడ్ల వరి గడ్డిని కొనుగోలు చేసుకొని తన నివాసం వద్ద ఓక వామి గా ఏర్పాటు చేసికొన్నారు .నిన్నటి దినమ దీపావళి పండుగ సందర్బంగా అక్కడే సమీపంలో రాత్రి సమయంలో బాణాసంచాలు పేల్చే క్రమంలో రాకెట్ మిరగల్లు గడ్డి వమి పై పడడంతో చిన్న చిన్న మంటలు పెద్ద పెద్ద మంటలుగా ఏర్పడి వరి గడ్డి అగ్గి మంటలకు ఆహుతి అయ్యింది .పైగా నిద్ర సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్లు వారు తెలిపారు .అప్పటికి పశుగ్రాసం పూర్తిగా మంటలలో పూర్తిగా దగ్ధమై బూడిద కావడంతో సుమారు లక్ష రూపాయలు పశుగ్రాసం నష్టం వాటినట్లు వారు తెలియజేశారు .నివాసాల మధ్య మంటలు పెద్దగా చెలరేగడంతో నివాస ప్రజలు బయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు




Total views : 194237