మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలంలో వైసీపీ చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో టీడీపీ నేత చూడి ఉలిగయ్య ఆధ్వర్యంలో, మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి 200 మంది వైసిపి కార్యకర్త లకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామంలో దాదాపు 20 కుటుంబాలు ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. రేపు రాబోయే ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేస్తామన్నారు. వైసీపీ ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి కి బిక్ష పెట్టిందే చంద్రబాబు నాయుడు అని అలాంటి వారిని మతిస్థిమితం లేదని అనటం సమంజసం కాదు అని హితువు పలికారు . నాకూ సరైన పోటీ ఎవరూ లేరని అన్నారు. నేను గెలిచి మంత్రాలయం లో టీడీపీ జెండా ఎగురవేస్తామన్నారు.
Kurnool
కర్నూల్ జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుసినె వీరుపాక్షి (Busine Veerupakshi) ఆధ్వర్యంలో టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా వలసలు. హాలహర్వి మండలం, గూళ్యం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు 300 కుటుంబాలు, దాదాపు 1000 మంది వైసీపీలో భారీగా చేరడం జరిగింది. ఆలూరు వైసీపీ అభ్యర్థి బుసినె వీరుపాక్షి వారందరికీ వైసీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకలు, అభివృద్ధి నచ్చి వైసీపీలో చేరడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్బంగా వీరుపాక్షికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు శాలువా కప్పి పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ఆరు మండలాల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఇది చదవండి: ఈసీ వాగులో యదేచ్చగా ఇసుక దందా.. నిద్రమత్తులో అధికారులు..
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
నంద్యాల జిల్లా డోన్ లో 03.04.2024 మధ్యాహ్నం డోన్ టౌన్ శ్రీ రామ నగరం నాయకల్లు భరత్ చంద్ర, బోయ ఉదయ్ ఇద్దరు పత్తికొండ ఏరియాలో ఒక వ్యక్తి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి డోనులో అమ్ముకోడం కొరకు ఇద్దరు పంచుకుంటుండగా పోలీసులకు సమాచారం రావడంతో 1100 గ్రాములు గంజాయి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలియజేయడమేమనగా ఎక్కువ శాతం యువతనే గంజాయి తీసుకుంటున్నారు. కాబట్టి వారి తల్లిదండ్రులు వారి పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలని డోన్ సీఐ తెలిపారు. వీరి దగ్గర నుంచి ఎవరు అమ్ముతున్నారు. అన్నా విషయంపై విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.
శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఈనెల 6 నుండి 10 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈనేపథ్యంలో దేవాదిదేవుడిని తనివితీరా దర్శించుకునేందుకు నల్లమల అడవి మార్గం గుండా కాలినడకన పాదయాత్రగా కన్నడ భక్తులు వేలాది తరలివస్తున్నారు. నల్లమల అంత ఓంకారనాదంతో ప్రతిధ్వనిస్తోంది ఉగాది పర్వదినం సమీపిస్తుండటంతో శ్రీగిరి మల్లయ్యను ధ్యాన మల్లన్న తండ్రి అదుకో అంటూ ఆర్తితో పిలుస్తూ శ్రీగిరి కొండకు చేరుకుంటున్నారు. నల్లమల అరణ్యం గుండా కాలినడకన వస్తున్న వారికి దేవస్థానం పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించింది. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం గ్రామం వద్ద మంచినీటి సౌకర్యం గతం కంటే బాగుందని అయితే అటవీ మార్గం మధ్యలో కొద్దిగా ఇబ్బంది ఉన్న ఏర్పాట్లు బాగున్నాయని కన్నడ భక్తులంటున్నారు.
నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే కన్నడ భక్తుల భజనలతో మార్మోగుతున్న శ్రీశైలం మరోపక్క వైద్య సదుపాయాలు బాగున్నాయని అడవి మార్గంలో బీమకొలను మీదుగా కొండెక్కి కన్నడిగులు పాదయాత్రగా నడుచుకుంటూ వస్తున్న నేపద్యంలో దేవస్థానం అధికారులు లక్షలు ఖర్చుపెట్టి కాలినడకన నల్లమల నుండి వచ్చే కన్నడ భక్తులకు వైద్య సౌకర్యాలు కల్పించారని పాదయాత్ర భక్తుల కోసం అడవిమార్గంలో రాళ్లు రప్పలు లేకుండా కాలినడకన వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు దారి వెంట ట్రాక్టర్లతో నీరు చల్లడం వచ్చే భక్తులకు మార్గమధ్యలో దేవస్థానం సహకారంతో స్వచ్చంద సేవకర్తలతో అన్నదాన ఏర్పాటు చేశారు. కన్నడ భక్తులు శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆడపడుచును తనివితీరా చూసేందుకు ఎండను సైతం లెక్కచేయకుండా మండుటెండలో ఎంతో భక్తి శ్రద్ధలతో వెంకటాపురం నుండి దట్టమైన అటవీప్రాంతంలో సుమారు 40 కిలోమీటర్లు నడుచుకుంటున్న వస్తున్న పాదయాత్ర కన్నడ భక్తుల కోసం పలువురు దాతలు కూడా మజ్జిగ, పండ్లు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు భక్తుల సౌకర్యాలపై దేవస్థానం ఈవో పెద్దిరాజు ప్రత్యేక దృష్టి పెట్టడం సంతోషంగా ఉందని పలువురు కన్నడ భక్తులు తెలిపారు.
వాలంటీర్ల (Volunteers) రాజీనామా..
నంద్యాల మండలం అయ్యలురు గ్రామానికి చెందిన 27 వాలంటిర్లు (Volunteers) మూకుమ్మడిగా రాజీనామా చేశారు. పంచాయతీ కార్యదర్శికి రాజీనామా పత్రాలను అందజేచారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ టీడీపీ నాయకులు పించన్ ఇవ్వకుండా అడ్డుపడుతూ లేడీస్ ని మాయం చేస్తున్నారని మాట్లాడిన మేము బాధపడలేదు కానీ వాలంటీర్లలో ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా మేము ఎందుకు అలా చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి నెల ఒకటవ తేదీన ఉదయమే నిద్ర లేచి అక్కా, చెల్లెమ్మలకు అవ్వ, తాతలకు పించన్ ఇచ్చే వాళ్ళమని అలాంటి మా మీద లేనిపోని నిందలు వేస్తూ ఇలా మాట్లాడటం దారుణమన్నారు. కరోనా కాలంలో ఎవరు బయటికి రాని సమయంలో కూడా ప్రజలకు సేవలందించామని తెలిపారు. చిన్న జీతమైన సొంత ఊరిలో ఉద్యోగం చేస్తూ రాజకీయాలకు అతీతంగా మేము ఎంతోమందికి సేవ చేశామని అయినా కూడా ప్రతిపక్ష నాయకులు మాపై కక్షపూరితంగా లేని పోనివి మాట్లాడం దారుణమన్నరు. మళ్ళీ జగన్ ను గెలిపించడం కోసం జగన్ చేసిన సేవలను ప్రజలకు తెలియజేస్తూ స్వచ్ఛందంగా ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు.
ఇది చదవండి : మద్యం మత్తులో విదేశీయుడి వీరంగం…
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి శివానంద రెడ్డి ఇంటికి వెళ్లారు తెలంగాణ పోలీసులు.. భూ వివాదం కేసులో శివానందరెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీసీఎస్ పోలీసులు వెళ్లినట్టుగా తెలుస్తుండగా.. అయితే, మొదట నోటీసు ఇవ్వాలని కోరారట శివానందరెడ్డి.. ఇక, తెలంగాణ పోలీసులు నోటీసు తయారు చేస్తుండగానే.. వేగంగా కారు ఎక్కి వెళ్లిపోయారు శివానంద రెడ్డి.. అడ్డుకునే ప్రయత్నం హైదరాబాద్ పోలీసులు చేయగా.. దొరకకుండా తప్పించుకొని వెళ్లిపోయారట శివానంద రెడ్డి.. ఇదే సమయంలో.. తెలంగాణ పోలీసులు.. శివానంద రెడ్డి వాహనాలు వెంబడించకుండా ఆయన అనుచరులు గేట్లు వేసినట్టుగా తెలుస్తోంది.
కాగా, హైదరాబాద్‌లో ఓ భూవివాదం కేసులో శివానందరెడ్డిని అరెస్టు చేసేందుకు అల్లూరు వెళ్లారట సీసీఎస్ పోలీసులు.. ఈ విషయం బయటకు పొక్కడంతో పెద్ద ఎత్తున శివానందరెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు టీడీపీ శ్రేణులు.. కాగా, టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్నారు మాండ్ర శివానందరెడ్డి.. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటూ వస్తున్నారు.. ఈ తరుణంలో అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధం కావడం.. ఆయన తప్పించుకుని పారీపోవడం చర్చగా మారింది. మరి ఈ కేసులో పోలీసులు తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనేది చర్చగా మారింది. అయితే, హైదరాబాద్ లో భువివాదంలో క్రైమ్ నెంబర్ 194/2022లో శివానందరెడ్డిని అరెస్టు చేసేందుకు సీసీఎస్ పోలీసులు ఆయన ఇంటికి వెళ్లినట్టుగా సమాచారం.
ఇది చదవండి: గాయత్రి పంపు హౌస్ నుండి వరద కాలువకు నీరు విడుదల..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం సమీపంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద శ్రీశైలం పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా నుంచి సుండిపెంటకు చెందిన ఇద్దరు వ్యక్తులు శ్రీశైలం వస్తుండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా శిఖరేశ్వరం వద్దకు చేరుకుని గంజాయితో వస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను శ్రీశైలం పోలీస్టేషనుకు తరలించారు. అయితే వారిలో ఒకరికి ఇరువై సంవత్సరాల వయసు నిండకపోవడంతో అతనిని మీడియాకు చూపలేదు.
వారిద్దరు గంజాయి ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారు ఎన్ని రోజులుగా గంజాయి తీసుకువస్తున్నారనే కోనంలో శ్రీశైలం ఒకటవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు విచారణ చేపట్టారు. ఆ ఇద్దరు వ్యక్తులు శ్రీశైలం మండలం సున్నిపెంటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారి నుంచి 110 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారిద్దరితో పాటు పోలీసులు స్వాధీనం చేసుకున్న హీరో హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్ వాహనాన్ని మరియు గంజాయిని సీజ్ చేసి ఆత్మాకూర్ కోర్టుకు తరలించారు.
శ్రీశైలం మల్లన్న ఆలయానికి (Srisailam Mallanna temple)భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం సెలవు కావడంతో క్షేత్రంలో భక్తులు రద్దీ పెరిగింది క్షేత్రమంత భక్తజనంతో శ్రీశైలం పురవీధుల్లో సందడి నెలకొంది తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి విచ్చేసారు అయితే భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవారి ఉచిత దర్శనానికి సుమారు 3 గంటలు,శ్రీస్వామివారి స్పర్శ దర్శనానికి గంట సమయం పడుతుంది అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం,పాలు,బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నారు.
ఇది చదవండి: ఫామ్ హౌస్ లో దొంగల బీభత్సవం..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
అనంతపురం జిల్లా కనేకల్ మండలం కనేకల్ క్రాసింగ్ ఫాం హౌస్ (Kanekal Crossing Farm House) లో శనివారం రాత్రి దొంగలు (Thieves) బీభత్సం సృష్టించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు కనేకల్ క్రాస్ లోని వ్యవసాయ తోటలో నివసిస్తున్న తిప్పారెడ్డి అనే రైతు ఇంట్లో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ముఖంకు మాస్కులు, చేతికి గ్లౌజులు ధరించి కుటుంబ సభ్యులను తుపాకులు, నాటు కొడవళ్ళతో బెదిరించి ఒంటిపై నగలు, బీరువాలో సొమ్ము దోపిడీ చేసిన సంఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు దుండగులు ఇంట్లోని కుటుంబ సభ్యులందరి వంటిపై ఉన్న 10 తులముల బంగారు నగలు, రూ 38,500 నగదు దోచుకెళ్లారు. కుటుంబ సభ్యులను ఇంటిలో వేసి తలుపులకు గడియ పెట్టి హుడాయించారు. వారి వద్ద ఉన్న మూడు సెల్ ఫోన్లను పగలగొట్టి చీకట్లో పడేశారు. ఇంటి ముందు ఉన్న ద్విచక్ర వాహనాలు ధ్వంసం చేశారు.
ఇది చదవండి: రోడ్డు దాటడానికి తంటాలు పడిన ఒంటరి ఏనుగు..
Follow us on : Google Newsమరిన్ని తాజా వార్తల కోసంఇక్కడక్లిక్చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
కర్నూల్ (Karnool) కు రానున్న జగన్:
సీఎం జగన్ చేపట్టిన మేము సిద్ధం బస్సు యాత్ర (Memu siddham Bus Yatra) నేడు కర్నూలు (Kurnool) జిల్లా ఎమ్మిగనూరుకు చేరుకోనుంది. సాయంత్రం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు. దాదాపు 6 ఎకరాల్లో ఉన్న వివార్స్ కాలనీ గ్రౌండ్లో ఈ మేము సిద్ధం సభను ఏర్పాటు చేశారు. సభలో లక్ష 50 వేలకు పైగా ప్రజలు పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను ఎమ్మిగనూరు అభ్యర్థి బుట్టా రేణుక దగ్గరుండి పరిశీలించారు.
మేము సిద్దం బస్సు యాత్ర నేడు కర్నూలు జిల్లాలోకి ప్రవేశించనుంది. పెంచికలపాడు నుండి మూడో రోజు యాత్ర ప్రారంభమై, కోడుమూరు నుండి రోడ్ షో గా వస్తు ఉదయం 9:30కు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని వేమూగోడు వద్ద ప్రవేశించనున్న బస్సు యాత్రకు నాయకులు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుండి నేరుగా రాళ్లదొడ్డి గ్రామంలో ఏర్పాటు చేసిన లంచ్ బ్రేక్ చేయనున్నారు. అక్కడి నుంచి నాలుగు గంటలకు ప్రజలకు అభివాదం చేస్తూ ఎమ్మిగనూరులోని వివర్స్ కాలనీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మేము సిద్దం సభలో సిఎం జగన్ పాల్గొని ప్రసంగించనున్నారని ఎమ్మిగనూరు అభ్యర్థి బుట్ట రేణుక తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో విజయం సాధించి క్లీన్ స్వీప్ చెయ్యడం ఖాయం అని బుట్ట రేణుక ధీమా వ్యక్తం చేశారు.
ఇది చదవండి:
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 81807