విశాఖ, దక్షిణ నియోజకవర్గం వైసీపీ లో కుమ్ములాట. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి మాకు వద్దంటూ కార్పొరేటర్లు ఆగ్రహం. 400 మద్యం బాటిళ్లు పంచి వైసీపీ పరువు తీసారంటున్న కార్పోరేటర్లు. MLA వాసుపల్లి గణేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. కళాశాలలో మద్యం పంపకాలు పై వాసుపల్లి పై తిరగబడ్డ ycp కార్పొరేటర్లు. అవసరమైతే వైసీపీకి రాజీనామా చేస్తామంటున్న కార్పొరేటర్లు. మందు పుల్ బాటిల్స్, కేజీ కోడి మాంసం పంపిణీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైసీపీ కార్పొరేటర్లు.
Vishakapattanam
అనకాపల్లి జిల్లా ఎంపీ సీటుపై వైసీపీ అధిష్టానం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. జిల్లాలో గవర సామాజిక వర్గం ఓట్లు కీలకం కానుండటంతో అదే సామాజికవర్గం నుంచి అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తోంది. నర్సీపట్నం వైసీపీ పరిశీలకుడు బొడ్డేడ కాశీ విశ్వనాథంను ఎంపీ అభ్యర్థిగా దించాలని వైసిపి హైకమాండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బొడ్డేటి కాశీ గవర సామాజికవర్గం కావడంతో ఎంపి టిక్కెట్ ఇస్తే అనకాపల్లిలోని ఏడు నియోజకవర్గాల్లో పార్టీకి అనుకూలంగా ఉంటుందని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో సోనోవిజన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కస్టమర్స్ కు కుచ్చుటోపీ పెట్టి కోట్లాది రూపాయలను సోనావిజన్ యాజమాన్యం దోపిడీ చేస్తుంది. పండగల సీజన్ వచ్చిందంటే చాలు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కల్లబొల్లి మాటలు చెబుతూ సామాన్య మధ్యతరగతి కుటుంబాలను లూటీ చేస్తోంది రీసెంట్గా విశాఖలో కోటి రూపాయలు పైబడే బ్లాక్ మనీ దొరకడంతో సోనోవిజన్ అక్రమాలు బయట పడ్డాయి ఫ్రిజ్, వాషింగ్ మిషన్ ల లో కూడా బ్లాక్ మనీ తరలిస్తూ అడ్డంగా బుక్ అయింది.
అల్లూరు జిల్లా చింతపల్లిలో చలి ఉష్ణోగ్రతలు 6.5 డిగ్రీ నమోదు కాగా, లంబసింగిలో 4.5 డిగ్రీలు ఉండవచ్చని అంచనా. దీంతో మన్యం ప్రజలు చలికి గజగజ వణికిపోతూ రగ్గులు స్వెటర్లు మంకీ టోపీలు వాడుతూ ఇంట్లో నుండి పొద్దు పొడిచి ఎండ కాసే వరకు బయటి రాలేకపోతున్నారు. మైదాన ప్రాంతం నుండి పర్యాటకులు చలిలో ఎంజాయ్ చేయటానికి పర్యాటక ప్రాంతాలైన లంబసింగి, చెరువులవేనం యు పాయింట్, తాజంగిడ్యామ్, కొత్తపల్లి జలపాతం, వంజంగి యుపాయింట్, అరుకు మొదలగు ప్రాంతాలు చూడటానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. చలిలో వృద్ధులు బాలింతలు చిన్నపిల్లలు చలికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అన్నమయ్య జిల్లా, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. నియోజకవర్గంలోని 98 సచివాలయ పరిధిలోని లక్ష గడపలకు వెళ్లిన ఎమ్మెల్యే. 186 రోజుల్లో పూర్తి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తైన సందర్భంగా సంబేపల్లి మండలం, నారాయణరెడ్డిపల్లి సచివాలయం కాంప్లెక్స్ లో శిలాఫలకం ఆవిష్కరణ. కెక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన వైఎస్ఆర్ సిపి ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది. పాల్గొన్న రెవిన్యూ, పోలీస్ శాఖ అధికారులు. విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తేలిపిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మంచి చేశాం కాబట్టే ప్రజల్లోకి వేళ్ళగలిగాం. ప్రతి ఒక్కరూ అదరించారు. తమతమ స్తోమతకు తగ్గట్లు స్వాగతాలు పలకడం, అల్పాహారాలు అందించారు. ఎమ్మెల్యే గా 15 ఏళ్లు ఉన్నప్పటికీ తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయగలిగా. రెండున్నర సంవత్సరం కరోనా లేకుంటే మరింత ఆభివృద్ది జరిగేది. మళ్లీ ప్రజలు అదరిస్తారన్న నమ్మకం ఉంది.
అల్లూరి జిల్లా, వి.ఆర్.పురం మండలం వీరపవనకుంటా గ్రామంలో దారుణం. అనుమానంతో భార్య పీక కోసి హత్య చేసిన భర్త సోయం చిరంజీవి. గొల్లగూడెం గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న మృతురాలు సోయం రాధ ( 32 ). అనాధాలుగా మిగిలిన నలుగురు ఆడపిల్లలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సమాచారంతో హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం నర్సింగ పేట ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 7వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. అర్ధ రాత్రి సమయంలో కడుపులో నొప్పి వస్తుంది అని హుటాహుటిన హాస్టల్ నుండి కూనవరం ప్రభుత్వ ఆసుపత్రికి స్కూల్ సిబ్బంది తరలించారు. కూనవరం ఆసుపత్రి వైద్యులు వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించమని చెప్పారు. వెంటనే ఆ అమ్మాయిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో 7వ తరగతి చదువుతున్న మడకం సంధ్య మృతి చెందింది. నా కూతురి మృతికి పాఠశాల సిబ్బందే కారణమంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రమ పాఠశాల ముందు మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువులు ధర్నా నిర్వహిస్తున్నారు.
కాకినాడ జిల్లా, రూరల్, ప్రభుత్వం పెంచిన 3000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో ఎం.పి.డి.ఓ కే.స్వప్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు హాజరయ్యారు. ప్రభుత్వం పెంచిన పెన్షన్ లను లబ్ధిదారులకు కన్నబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నుండి పెన్షన్ డబ్బులు నేరుగా ఇంటికే అందేలా ఆలోచించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 65 సంవత్సరాలు నిండిన వారికే పెన్షన్లు ఇచ్చేవారు. పెద ప్రజల కష్టాలు చూసిన జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే వాలంటీర్ వచ్చి లబ్ధిదారులకు అందజేసి దేశం లో చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా పాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశం లో ఏ రాష్ట్రం లో ఇవ్వని విధంగా 3000 రూపాయలు పెన్షన్ లు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని, కులం, మతం, ఏ రాజకీయ పార్టీ కి మద్దతు ఇచ్చారు అని చూడకుండా అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తున్న దమ్మున నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఎల్.డి.ఓ పట్టంసెట్టి నారాయణ మూర్తి, ఎం.పి.పి గోపిసెట్టి పద్మజ బాబ్జీ, జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, తిమ్మపురం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం, గైట్ కాలేజీలో అంగరగవైభవంగా ప్రారంభమైన 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు. తెలుగు పండుగలా సందడిగా మారిన గైట్ కాలేజీ ఆవరణ. చైతన్య విద్యాసంస్థలు అధినేత చైతన్య రాజు, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ. శ్రీశ్రీ రాజ రాజ నరేంద్రుల పట్టాభిషేక సహస్రాబ్ది నీరాజనంగా తెలుగు మహాసభలు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అతిధులు, ప్రతినిధులు. విశాఖ శారదా పీఠం శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో తెలుగు మహాసభల అంకురార్పణ కార్యక్రమం. మహాసభల ప్రారంభోత్సవ సభ వేదికకు రాజరాజ నరేంద్ర వేదికగా నామకరణం. మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు. తొలిరోజు ముఖ్యఅతిథిగా హాజరు కానున్న రాష్ట్ర గవర్నర్ , న్యాయమూర్తులు, పలువురు రాష్ట్ర మంత్రులు, సాహిత్య ప్రముఖులు, ప్రతినిధులు.
అల్లూరి జిల్లా దేవిపట్నం మండలం లో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పోచమ్మ గండి ఆలయ సమీపంలో ఉన్న పర్యాటక బోటింగ్ పాయింటును రంపచోడవరం సి.ఐ వాసా వెంకటేశ్వరరావు, ఎస్సై నాగార్జున పరిశీలించారు. అనంతరం పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్లలో తనిఖీలు నిర్వహించారు. అవుట్ పోలీస్ స్టేషన్ చెక్ పోస్ట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా రంపచోడవరం సిఐ మాట్లాడుతూ పర్యాటకులు తీసుకోవలసిన జాగ్రత్తలు, పర్యాటకులకు వివరించారు. బోట్ సిబ్బందికి, యాజమాన్యానికి కూడా నియమ, నిబంధనలు సక్రమంగా పాటించాలని లేని యెడల శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు.




Total views : 92722