అల్లూరి జిల్లా చింతపల్లి అంబేద్కర్ కాలనీలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ద్వారా, పాడేరు నియోజక వర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి అభిమానులు కార్యకర్తలు పూల జల్లులతో చింతపల్లి నలుమూలల పర్యటించారు. అనంతరం చింతపల్లి అంబేద్కర్ కాలనీలో భారీ బహిరంగ సభలో, నేను మీకు అండగా ఉన్నాను, మన ప్రభుత్వ రావడానికి ఒక్క నెల మాత్రం ఉంది, మీ భవిష్యత్తు గ్యారెంటీ మీకు ఏ కష్టం వచ్చినా ఏ అర్ధరాత్రి అయిన నన్ను పిలవండి నేను వస్తాను.. మీ సమస్య తీరుస్తాను.. మీ శరీరం మీద ఈగ పడితే నా శరీరం మీద దుడ్డు పడినట్లే మా వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే నేను ఊరుకుండేది లేదని బరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైసీపీలో పనిచేస్తున్న ముఖ్య నేత చిందాడ, చిన్నతోపాటు, అంబేద్కర్ కాలనీ వాసులు తెలుగుదేశం పార్టీలోకి గిడ్డి ఈశ్వరి చేతుల మీదుగా, తెలుగుదేశం కండువాలు వేసుకొని పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు పై అభిమానంతో ఈ రోజున ప్రజలు భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Vishakapattanam
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. భీమిలి నియోజకవర్గం తగరపువలస లో ‘సిద్ధం’ పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించబోతున్నారు. ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సభ ప్రారంభంకానుంది. ఈ సభలో వేదిక మాత్రమే కాకుండా పెద్ద ర్యాంప్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ర్యాంప్ మీద నడుచుకుంటూ కార్యకర్తల్లోకి వెళ్లి, వారితో జగన్ మమేకమవుతారు. పార్టీ కేడర్ అభిప్రాయాలను స్వయంగా తెలుసుకుంటారు.
అల్లూరి జిల్లాలో ఘోర ఘాట్ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు బయలుదేరిన ఇన్నోవా కారు లోయలోకి దూసుకుపోవడంతో ఘోర రోడ్ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో 11 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒక మహిళా మృతి చెందింది. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. బాధితులను స్థానిక అరుకు ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులు అందరూ ఒకే కుటుంబంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విశాఖపట్నం, మాధవధారకు చెందిన వారుగా గుర్తింపు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం 70 గడపల గల వాలగూడెం గ్రామం, మఠం భీమవరం పంచాయితీ, కొయ్యూరు మండలం, ఈ గ్రామం లో త్రాగు నీటి సమస్యతో ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. ఈ సమస్య గురించి పలుమార్లు అధికారులని విన్నవించుకున్న పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. మా గ్రామాన్ని అధికారులు పట్టించుకొని త్రాగునీటి సమస్యను తీర్చాలనికోరుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 35 ఎంపీ సీట్లు వస్తాయని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో వాక్ నిర్వహించారు. దేశంలో రాహుల్ కన్నా ప్రధాని మోడీకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. 100 సంవత్సరాలుగా సాధ్యంకాని పనులు మోడీ హాయాంలో జరుగుతున్నాయన్నారు. ప్రజల మూడ్‌తో సంబంధం లేకుండా రాహుల్ కార్యక్రమాలు చేపడుతున్నారని జీవీఎల్ ఎద్దేవా చేశారు. విశాఖలో మూడేళ్లుగా చాలా సమస్యలు పరిష్కరించామని, స్థానిక ఎంపీ కంటే కూడా తానే ఎక్కువగా పని చేస్తున్నానని తెలిపారు.
హుకుంపేట మండలం డోంకిన వలస జంక్షన్ నుంచీ గేదెల పాడు వరకు 5 కిలోమీటర్లు మేరా తారు రోడ్డు నీ నాసిరకం గా నిర్మించిన కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర మేధావుల కన్వినర్ కురుస పార్వతమ్మ డిమాండ్ చేశారు. హుకుంపేట మండలం లోని జెర్రకొండ పంచాయతీ గేదెల పాడు గ్రామాన్ని స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తల తో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నాసిరకంగా నిర్మించిన తారు రోడ్డును పరిశీలించాలని అన్నారు. గ్రామస్తుల పిర్యాదు మేరకు గేదెల పాడు గ్రామం లో నిర్మించిన తారు రోడ్డును పరిశీలించినట్లు తెలిపారు. ఎన్ ఆర్ ఈ జి ఎస్ కేంద్ర ప్రభుత్వ నిధులు సుమారు 2 కోట్ల రూపాయల తో నిర్మించిన తారు రోడ్డు మున్నాళ్ళ ముచ్చటగా మిగిలిందన్నారు. రోడ్డు నిర్మించిన 10 రోజుల్లోనే రోడ్డు మధ్యలో గడ్డి మొక్కలు మొలిచాయని, కాలి తో గట్టిగ కెలికితే ముక్కలు ముక్కలు గా రోడ్డు ఊడి వస్తుందన్నారు. 75 సంవత్సరాల తరువాత గ్రామానికి రోడ్డు మంజూరు ఐతే ఈ విధంగా గుత్తేదారు నిర్లక్ష్యం తో రోడ్డు నిర్మించడం శోచనీయం అన్నారు. సంబంధిత జిల్లా ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం కారణం గానే ఈ విధంగా రోడ్డు నిర్మాణం జరిగిందని ఆరోపించారు. ఇంత జరిగిన స్థానిక గ్రామాల గిరిజన ప్రజలు ఆందోళన చేస్తున్నారు తప్ప, వీరి ఓట్ల తో గెలిచినా స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ సమస్య పై మాట్లాడక పోవటం పై పలు అనుమానాలకు దారి తీస్తుందన్నారు. నాసిరకం గా రోడ్డు నిర్మించి 2 కోట్ల ప్రజా ధనం వృధా చేసిన కాంట్రాక్టర్ పై జిల్లా కలెక్టర్ కి బీజేపీ తరుపున పిర్యాదు చేస్తామని తెలిపారు. మిగతా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న పధకాలైన నాణ్యతతో నిర్మించేలా జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మఠం శాంత కుమారి మాట్లాడుతూ.. నాసిరకం నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టి, ఇతర ప్రభుత్వ పనులు అతనికి కాంట్రాక్టు ఇవ్వకుండా చూడాలని జిల్లా కలెక్టర్ గారిని కోరారు. రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు క్వాలిటి కంట్రోల్ అధికారులు పర్యవేక్షణ చెయ్యాల్సిన అవసరం ఉన్న, అసలు ఆ డిపార్ట్మెంట్ ఉందొ లేదో ప్రజలకు తెలియటం లేదన్నారు. వాళ్ళ పరిశీలన గనక ఉంటే ఈ విధంగా 2 కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా కాకుండా ఉండేదన్నారు. తక్షణమే సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాంగి మత్స్య కొండ బాబు, బీజేపీ మండల నాయకులు సింహ చలం, సింహాద్రి, గేదెల పాడు గ్రామ ప్రజలు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read Also..
తగరపువలసలో జరగనున్న సిద్ధం బహిరంగ సభ సన్నాహక సమావేశం శ్రీకాకుళంలో నిర్వహించారు. ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో రెండు నెలల్లో రాబోతున్న ఎన్నికలకు అందరూ సమాయత్తం అవ్వాలన్నారు. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ , 5 ఎంపి స్దానాలను గెలిపించుకొవాలని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్న ప్రతిపక్షాలు కుళ్ళు కుతంత్రాలతో దుమ్మెత్తి పోస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టడానికి, కార్యకర్తలకు దశ దిశ నిర్దేశించడానికి ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిద్ధం సభలో అన్ని పదవుల్లో ఉన్న నేతలు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు. 175 నియోజకవర్గాల్లో ఇటువంటి సభలు నిర్వహిస్తామన్నారు. ముఖ్యమంత్రి పాల్గొంటున్న ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
విశాఖ కేంద్ర కారాగారంలో కోడికత్తి కేసులో నిందితుడుగా ఉన్న జనపల్లి శ్రీనివాస్ తో గురువారం( నేటి ) మధ్యాహ్నం దళిత సంఘాల నాయకులతో కలసి వి ద సం అధ్యక్షుడు బూసి వెంకటరమణ జైల్లో ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయటకు వచ్చి ఫ్ల కార్డులతో నినాదాలు చేసారు. ఈ సంధర్భంగా బూసి వెంకటరమణ మట్లాడుతూ నిందితుడు శ్రీనివాస్ ఉదయం నుంచి దీక్షలో ఉన్నాడని జైలు అధికారులు ఈ సాయంత్రానికి గాని అనుమతి ఇవ్వలేమని చెప్పారని అన్నారు. అయినా శ్రీనివాస్ దీక్ష ప్రారంభించారన్నారు. ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ ఇవ్వాల్సిన బాధ్యత జైలు అధికారులకు ఉందని, కోడి కత్తి కేసులో బాధితుడు జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. కోడి కత్తి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్.ఐ.ఏ స్పష్టం చేసినా ఎందుకు జగన్ కోర్టుకు వెళ్లారని ప్రశ్నించారు. శ్రీనివాస్ ను జైల్లో మగ్గేలా చేసి బయటకు రానివ్వకుండా కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ బయటకు వస్తే జగన్ కు ఎన్నికల ముందు చిక్కులు తప్పవనే ఆపుతున్నారని, ఎస్సీలపై కోర్టులో ఉన్న 19 కేసులను ఇటీవల ఎత్తివేశారని శ్రీనివాస్ విషయంలో ఎందుకు ఉదారత చూపించలేకపోతున్నారని అన్నారు. దళితుల పట్ల కపటి ప్రేమ చుపిస్తున్నావని జగన్ దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం కోడి కత్తి శ్రీనును వెంటనే విడుదల చేయాలంటూ అమలాపురంలో దళిత సంఘాల ఆందోళన. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో దళిత సంఘాల ఆందోళన. జైల్లో ఉన్న కోడి కత్తి శ్రీను వెంటనే విడుదల చేయాలంటూ గడియార స్తంభం సెంటర్లో నిరసన ర్యాలీ చేసిన దళిత సంఘాలు. నిందితుడు అనంత బాబును వదిలేసి దళిత యువకుడు కోడి కత్తి శీను జైలా అంటూ ఆందోళన. ఐదు సంవత్సరాలుగా జైల్లో మగుతున్న కోడి కత్తి శ్రీనుకు సాక్ష్యం చెప్పని ముఖ్యమంత్రి జగన్. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టి డబ్బా కొట్టుకుంటున్న ముఖ్యమంత్రి జగన్. నిందితుడు అయిన అనంత బాబుకు బెయిల్ ఇచ్చి దళిత యువకుడి కి బెయిల్ ఇవ్వకపోవడం దారుణం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు హాజరై కోడి కత్తి శ్రీనుకు బైల్ ఇప్పించాలి. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు చేపడుతామటూ హెచ్చరించిన దళిత సంఘాల నేతలు. గడియార స్తంభం సెంటర్లో ఆందోళన నిరసన ర్యాలీ చేపట్టిన దళిత సంఘం నేతలు.
విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీలో కుమ్ములాట తారా స్థాయికి చేరుతోంది స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ని వ్యతిరేకిస్తూ కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాసుపల్లికి టికెట్ ఇస్తే ఖచ్చితం గా ఓడిస్తామని సవాల్ విసురుతున్నారు. కార్పొరేటర్ విల్లూరు భాస్కర్ రావు మరింత ముందుకు వచ్చి
వాసుపల్లి మీద అవసరమైతే ఫిర్యాదు చేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధి అయ్యుండి 400 కు పైగా మద్యం బాటిల్స్ లను ఎలా పంచుతారు అని విల్లూరి భాస్కరరావు అంటున్నారు.



Total views : 92554