వైసీపీ క్యాడర్ ను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విశాఖ జిల్లా భీమిలిలో తొలి సిద్ధం సభ నిర్వహించిన జగన్ నేడు ఏలూరులో రెండో సభ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భీమిలి సభలో తన వాడీ వేడీ ప్రసంగంతో వైసీపీ క్యాడర్ లో జోష్ నింపిన వైఎస్ జగన్ ఏలూరు సభను కూడా అంతకు మించి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దీంతో ఏలూరులో జగన్ ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ క్యాడర్ లో పెరుగుతోంది. అలాగే భీమిలి సభకు మించి ఇక్కడ జన సమీకరణ కూడా చేస్తున్నారు. దీంతో ఈ భారీ సభలో సీఎం జగన్ సుదీర్ఘంగా క్యాడర్ కు దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Vishakapattanam
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి ఈరోజు అనగా న విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి వారు శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారు శ్రీ అమ్మవారి ఆలయంనకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామీజీ వారితో పాటుగా గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయశాఖ సలహాదారు శ్రీ జ్వాలాపురం శ్రీకాంత్ గారు విచ్చేశారు. అనంతరం స్వామిజి వారు శ్రీ అమ్మవారిని దర్శనము చేసుకొని, పూజలు నిర్వహించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము ఆలయ వేద పండితులు, అర్చకుల వారు స్వామీజీ వారికి వేదస్వస్తి పలికారు. అనంతరం ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు గారు, అధికారులు స్వామీజీ వారికి శ్రీ అమ్మవారి ప్రసాదములు, పండ్లు సమర్పించగా, స్వామీజీ వారు అందరికీ అనుగ్రహభాషణము చేశారు.
విశాఖ, మధురవాడలో కొమ్మాదిలో mro దారుణం హత్య. కొమ్మది చరణ్ క్యాస్టల్ లో సంచలన రేపిన ఘటన. రూరల్ తహశీల్దార్ సనపల రమణయ్య పై హత్య చేసిన దుండగులు. గుర్తు తెలియని నలుగురు ఇంట్లో చొరబడి రాడ్ లతో దాడి. అక్కడక్కడే కుప్పకూలిన తహసీల్దార్ రమణయ్య. ప్రాణప్రాయం స్థితిలో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తహశీల్దార్ మృతి. ఘటన స్థలానికి క్షుణ్ణంగా పరిశీలించిన సిపి రవిశంకర్ ఆయన్నర్. నిందితులు కోసం పోలీసులు గాలింపు. ఘటన పై జిల్లా కలెక్టర్ సీరియస్…
అల్లూరి జిల్లా ఎస్పీ తుసన్ సిన్హా కృషితో ఈనెల ఫిబ్రవరి 6 తారీఖున టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ తో మెగా జాబ్ మేళా నిరుద్యోగులైన యువతులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారి కొరకు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయనున్నట్లు చింతపల్లి అదనపు ఎస్పి ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. నిరుద్యోగులైన యువతులు ఆరో తారీఖు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు చింతపల్లి వైటిసి నందు ఈ ప్రేరణ కార్యక్రమానికి ధ్రువపత్రాలతో హాజరు కావాలని అన్నారు. అర్హులైన యువతలకు బెంగళూరులో కోచింగ్ సెంటర్ నందు ఉచిత భోజనం వసతులు కల్పించి సుమారు 20 వేల రూపాయల ఉద్యోగ భద్రత కల్పిస్తారని అన్నారు. ఈ యొక్క ఉద్యోగ అవకాశం అల్లూరి జిల్లాలో యువతలు సద్వినియోగం చేసుకోవాలని చింతపల్లి అదనపు ఎస్పి ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రమేష్, ఎస్సై అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
రేపటి నుండి విశాఖ వేదికగా భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మ్యాచ్ కు సర్వం సిద్ధం. రోజుకు 2 వేల మంది చొప్పున 5 రోజులకు 10 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం. క్రికెట్ క్లబ్ క్రీడాకారులకు రోజుకు 2,850 మంది చొప్పున 5 రోజులకు 14,250 మందికి కూడా ఉచితమే. ఇప్పటి వరకు ఆన్లైన్లో 15 వేలు, ఆఫ్‌లైన్‌లో 5 వేల టికెట్ల విక్రయం. భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టు మ్యాచ్‌కు అన్ని రకాల ఏర్పాట్లు చేసిన జిల్లా అధికార యంత్రాంగం. విద్యార్థులు, క్లబ్ క్రీడాకారులకు ఉచితం. విద్యార్థులు యానిఫాంతో రావాలి లేదా ఐడీ కార్డులు తప్పనిసరిగా చూపించాలి. విద్యార్థులను గేట్ నంబర్ 14 నుంచి ‘కె’ స్టాండ్‌లోకి అనుమతిస్తారు. మ్యాచ్ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు.
అనకాపల్లి జిల్లా.. గవరపాలెంలో పార్క్ సెంటర్ వద్ద కేబుల్ ఆపరేటర్ ఈ నెల 26న ఓ మహిళ గొంతు నులిమి హత్యాయత్నంకు పాల్పడి గొలుసు ఎత్తుకెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు, కొడుకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. పోలీసులు దర్యాప్తులో నిందితుడు కేబుల్ ఆపరేటర్ గా గుర్తించి, నిందితుడు కోసం గాలిస్తున్నారు. ఈ సందర్భంగా డిఎస్పి సుబ్బరాజు మాట్లాడుతూ.. గవరపాలెం పార్క్ సెంటర్ వద్ద తమ నివాసం లో ఒంటరిగా ఉంటున్న కర్రీ లక్ష్మీనారాయణమ్మ ఈ నెల 26న రాత్రి 7.30 గంటల సమయంలో తల్లి లక్ష్మీనారాయణమ్మని చూడడానికి వచ్చిన కూతురు, సోపాలో అపస్మార్క స్థితిలో ఉన్న లక్ష్మీనారాయణమ్మను చూసి కంగారుపడి కుమార్తె వెంటనే ఆరోగ్యం బాగోలేదని స్థానిక బెనర్జి హాస్పిటల్ లో జాయిన్ చేసారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వైజాగ్ కేర్ హాస్పిటల్ కు తరలించారు. ఈ విషయం హైదరాబాదులో ఉన్న కొడుకు కర్రి కిషోర్ కి తెలియడం తో హుటా హుటిన బయలుదేరారు. ఆస్పత్రికి వెళ్లి తమ తల్లిని చూసిన కొడుకు అయితే తల్లి చేతికి బంగారు గాజులు ఉన్నాయి కానీ మెడలో గొలుసు లేదని గుర్తించిన కొడుకు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి క్లూస్ టీం ద్వారా అలాగే అన్ని రకాలుగా దర్యాప్తు చేయగా దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దర్యాప్తులో నిందితుడు కేబుల్ ఆపరేటర్ గా గుర్తించమన్న పోలీసులు నిందితుడు కోసం గలిస్తున్నాం అని తెలియజేశారు.
విశాఖ బీచ్ లో చెత్తను ఏరివేసీ క్లీన్ డ్రైవ్ లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాల్గొన్నారు. మిస్ పెర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా బీచ్ క్లీన్ డ్రైవ్ చేసిన లావణ్య త్రిపాఠి అందరూ పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని కోరారు. లావణ్య త్రిపాఠీని చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు ఎగబడ్డారు. అంతే కాకుండా స్వచ్ఛందంగా పరిశుభ్రత కార్యక్రమంలో జనాలు భారీగా పాల్గొన్నారు.
ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో శోభాయ మానంగా స్వర్ణపుష్పార్చన జరిపించినట్లు ఈవో శ్రీనివాసమూర్తి తెలియజేశారు. ఉదయం స్వామివారికి స్వర్ణపుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణపుష్పార్చన అత్యంత వైభవంగా, సింహాచల పుణ్య క్షేత్రములో దేవస్థాన వేదపండితుల వేదమంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణపుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువ జామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపములో వేదికపై అధీష్టింపజేసి వేద మంత్రాలు నాధ స్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి వారి స్వర్ణపుష్పార్చన, సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామి వారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు.
అనకాపల్లి.. నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో ఘోర విషాదం. సెప్టిక్ ట్యాంక్ గొయ్య తవ్వుతుండగా ప్రమాదవశాత్తు ఇసుక మేటల్లో రంగాల జగదీష్ (28) ఇరుక్కుపోయాడు. గ్రామస్తులు జేసీబీ సహయంతో ఇసుక మేటలు తవ్వున్నారు. రెండు గంటలగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలాని చేరుకున్నారు. జగదీష్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
విశాఖపట్టణం విమానాశ్రయంలో జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి వెనక ఓ పనికిమాలిన మంత్రి ఉన్నారని కాంగ్రెస్ నేత, కేంద్రమాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీను ప్రాణాలను రేపోమాపో తీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని, వైసీపీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు. తిరుపతిలో నిన్న విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విమానాశ్రయంలోకి కత్తి ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఆ ఘటన జరిగిన సమయంలో అక్కడున్న భద్రతాధికారులతో తాను మాట్లాడానని, అప్పుడు కత్తి లేదని, జగన్‌కు రక్తం కూడా రాలేదని వారు చెప్పారని పేర్కొన్నారు. ఓట్ల కోసం ఇలాంటి దుర్మార్గాలకు దిగడం సరికాదని హితవు పలికారు. జగన్ తన స్వలాభం కోసం దళితుడైన శ్రీనును ఐదేళ్లుగా జైలులో ఉంచడం దళిత ద్రోహానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనును వెంటనే విడుదల చేసి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.




Total views : 92495