మిచాంగ్ తీవ్ర తుఫాన్‌తో ఉప్పెన ముప్పు పొంచి ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో తీరం వెంబడి 100 నుంచి 11 0కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయి. తీరం దాటిన తర్వాత కూడా మిచాంగ్ ఉద్ధృతి కొనసాగుతుంది. దక్షిణ కోస్తాకు రెడ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. నెల్లూరులో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురుస్తుంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాగుంట లేఔట్ ప్రధాన రహదారి వెంబడి ఉన్న అపార్ట్ మెంట్లు , షాపింగ్ మాల్స్ నీటిలో మినిగిపోయాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. పెన్నా పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Vishakapattanam
మిచాంగ్ తుపాను కారణంగా విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు ఇండిగో సంస్థ విశాఖపట్నం నుంచి చెన్పై వెళ్లాల్సిన రెండు విమాన సర్వీసులను నిలిపివేసింది. ఒక విజయవాడ సర్వీసును రద్దు చేసింది. తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడులోనూ కనిపిస్తోంది. దీంతో కోయంబత్తూరు-చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను ఇండిగో సంస్థ రద్దు చేసింది. చాలా విమానాలను చెన్నై ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరులోని కెంపెగౌడ్ విమానాశ్రయానికి మళ్లించారు. ఇప్పట వరకు దాదాపు 11 విమానాలను దారి మళ్లించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ ఎర్రంపేటలో శనివారం రాత్రి ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గజేంద్రకుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉన్న శ్రీకాంత్ (38) ప్రియాంక (30) సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమె భర్త దుర్గాప్రసాద్ (పండు) చూశాడు. కోపోద్రిక్తుడైన ఆయన ఇనుప రాడ్డుతో ఇద్దరిని బలంగా కొట్టాడు. శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రియాంకను చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 17తో ముగియనుంది. భీమిలి నియోజకవర్గంలో యువగళం ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ మేరకు టీడీపీ విశాఖ పార్లమెంటు స్థానం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. యువగళం పాదయాత్ర డిసెంబరు 6న అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటకు చేరుకుంటుందని, పాయకరావుపేట 7న మొదలయ్యే యువగళం డిసెంబరు 17తో సమాప్తం అవుతుందని పల్లా శ్రీనివాసరావు వివరించారు. నారా లోకేశ్ జనవరి 27న కుప్పంలో యువగళం పాదయాత్ర షురూ చేశారు. 4 వేల కిలోమీటర్లు, 400 రోజుల పాటు పాదయాత్ర సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మధ్యలో చంద్రబాబు అరెస్ట్ కావడంతో యువగళానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవలే లోకేశ్ యువగళాన్ని పునఃప్రారంభించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో ఉక్కు సత్యాగ్రహం పేరిట సత్యారెడ్డి దర్శకత్వంలో సినిమా ప్రమోషన్ శ్రీకాకుళం నగరంలో నిర్వహించారు. ఈ సినిమాలో పల్సర్ బైక్ ఝాన్సి హీరోయిన్ గా నటించిందని తెలిపారు. దర్శకుడు సత్యారెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది త్యాగ ధనుల కృషి ఫలితమే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అని పేర్కొన్నారు. ఈ చిత్రం చూసిన వారు మరలా అలనాటి రోజులు గుర్తు చేసుకుంటారని అన్నారు. ఈ సినిమాలో మొదటి భాగంలో భవిష్యత్తు తరాలకు, తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయం తెలుస్తుందన్నారు. ఈ చిత్రంలో గద్దర్ ప్రధాన ప్రాత్ర పోషించారన్నారు. ఆయన నేడు మన మధ్యలో లేకపోయినా ఆయన ఆశీస్సులు ఉంటాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అసువులు బాసిన 32 మంది త్యాగమూర్తులకు ఈ చిత్రం అంకితం చేస్తున్నామన్నారు. విశాఖ ఉక్కు… ఆంద్రుల హక్కు అని నినాదించారు.
గెజిటెడ్ అధికారి అయిన ఓ ఎంపీడీవోపై మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే బహిరంగ వేదికపై దుర్భాషలాడారు. ఎవడ్రా నువ్వు ఏం తమాషాలు చేస్తున్నావా ఏం మాట్లాడుతున్నావు అని మండిపడ్డారు. ఇదీ అయ్యప్ప మాలలో ఉండి కూడా ఆయన ఇలా చిందులు తొక్కడం తీవ్ర చర్చనీయాంశమైంది. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ‘ఆంధ్రప్రదేశకు జగనే ఎందుకు’ కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల కృష్ణాపురం, పాండ్రంగి తదితర గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమాల ఫొటోలు ఎందుకు అప్లోడ్ చేయలేదంటూ మండల వైకాపా అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు ఎంపీడీవో విజయ్ కుమార్ ను ప్రశ్నించారు. ఆ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొనకపోవడంతో వాటికి సంబంధించినవి అప్లోడ్ చేయలేదని ఎంపీడీవో సమాధానమిచ్చారు. దాంతో ఎమ్మెల్యే బహిరంగ సభ అని కూడా చూడకుండా అందరి ముందూ ఎంపీడీవో ను నోటికొచ్చినట్లు మాట్లాడారు! ఒక దశలో ఎంపీడీవోపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు సుంకర గిరిబాబు వారించారు.
ఇటీవల పాండ్రంగిలో కార్యక్రమం రసాభాస కావడంతో సంక్షేమ పథకాల బోర్డు ఆవిష్కరించకుండానే ఎమ్మెల్యే వెనుదిరిగారన్నారు. తర్వాత సర్పంచి దాన్ని ఆవిష్కరించడంతో ఆ ఫొటోను సిటిజన్ అవుట్ రీచ్ యాప్‌లో అప్లోడ్ చేశామని, ఆ విషయం సభలో వివరిస్తుండగా ఒక్కసారిగా ఎమ్మెల్యే ఆగ్రహించారని చెప్పారు.
విశాఖ దండు బజార్ జగదాంబ సెంటర్లో దారుణం. సిద్ధార్థ హాస్పటల్ లో కాసులకు కక్కుర్తి పడి గుట్టుచప్పుడుగా అబార్షన్లు కొనసాగుతున్నాయి. విశాఖ సిద్ధార్థ హాస్పిటల్ దాస్టికాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేస్తున్నారు. 50వేల రూపాయలు తీసుకొని ఆరు నెలల గర్భవతి కి అబార్షన్ చేసిన వైనం చోటుచేసుకుంది. దారుణంగా పసికందును ప్లాస్టిక్ కవర్లో పెట్టి స్మశాన వాటికకు తరలించారు. సిద్ధార్థ ఆసుపత్రి వార్డ్ బాయ్ సహకారంతో పసికందుకు దహన సంస్కారాలు చేపట్టారు. సిద్ధార్థ ఆసుపత్రిలో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న అక్రమ కార్యకలాపాలు, భారతి అనే గర్భిణీకి మత్తుమందు ఇచ్చి అబార్షన్ చేసిన వైద్యులు, బాధితురాలు భారతి సివిఆర్ న్యూస్ ని ఆశ్రయించింది.
నగరంలో వరస అగ్ని ప్రమాదం తో ప్రజలు భయభ్రాంతులు. ఫిషింగ్ హార్బర్ గంగలమ్మ గుడి వద్ద ఎగసిపడిన మంటలు. సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై వివరాల ఆరా తీసిన పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్. ఫిషింగ్ హార్బర్ వద్ద గాంధీ విగ్రహం వద్ద బడ్డీలు నుంచి ఎగసిపడుతున్న మంటలు. ప్రమాదం పై ఆరా తీస్తున్న విశాఖ పోలీసులు. వరుస అగ్ని సంఘటనలతో భయబ్రాంతులకు గురవుతున్న విశాఖ వాసులు. చేపల వేటకు సంబంధించినవన్ని బూడిద పాలు అయ్యాయని మత్స్యకారులు ఆవేదన. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక శాఖ.
కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచన తనకు ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రానున్న ఎన్నికల్లో తాను మరోసారి విశాఖ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. బోగస్ ఓట్లను కచ్చితంగా తొలగించాల్సిందేనని అన్నారు. నిజమైన ఓట్లను తొలగిస్తుండటంపై ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పారు. డిసెంబర్ 2న జేడీ ఫౌండేషన్, నిపుణ హ్యూమన్ డెవలప్ మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేళాలో 50కి పైగా కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. సెలెక్ట్ అయిన వారికి అక్కడికక్కడే ఆఫర్ లెటర్లను ఇస్తామని వెల్లడించారు. పదో తరగతి, ఆపై విద్యార్హత ఉన్నవారు జాబ్ మేళాకు హాజరు కావచ్చని చెప్పారు.వెనుకబడిన అభ్యర్థులకు స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తామని తెలిపారు.




Total views : 223657