తుఫాను ప్రభావంతో పంట పోలాలు నీట మునగడంతో… రైతులను ప్రతిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూర్ల రామాంజనేయులు పరామర్శించారు.
నీట మునిగిన వరి, పొగాకు, మొక్కజొన్న, మిర్చి, శనగ , ప్రత్తి,మినుము పంట పొలాలను సందర్శించారు. మోకాలు లోతులో నీరు ఉన్న పొలంలోకి వెళ్లి రైతుల నుండి ఎంత నష్టపోయారో అడిగి తెలుసుకున్నారు. అదైర్యపడవద్దు, ప్రభుత్వం నుండి మీకు రావాల్సిన నష్టపరిహాన్ని వచ్చే విధంగా టీడీపీ తరఫున పోరాటం చేస్తాము అని చెప్పారు. కాలవలలో పూడికతీత పనులు చేయకపోవడం వల్ల రైతులకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. పంట నష్టపోయిన రైతులందరికీ తక్షణమే నష్టపరిహారం ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. జగనన్న కాలనీ కొరకు కేటాయించిన భూములు పరిశీలించి జగన్మోహన్ రెడ్డి చేతగానితనానికి ఈ ప్రాంతం ఒక నిదర్శనం అని పేర్కొన్నారు . పూర్తిగా మొలిచిన తుమ్మ చెట్లతో ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు.
Vishakapattanam
జీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నా.. ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయనని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విశాఖలోని ఎస్.రాజా గ్రౌండ్లో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. విశాఖ ఉక్కు అంశం భావోద్వేగంతో కూడిన అంశమని అన్నారు. ఇదే విషయాన్ని కేంద్రంలోని పెద్దలకు సైతం చెప్పినట్లు పవన్ తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఎలాంటి భావోద్వేగాలకు దారి తీస్తుందో తెలియదన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పోరాటం.. అన్ని జిల్లాలను ఏకం చేసిన నినాదం అని.. ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నం చేయగలిగామన్నారు. తాను ఎప్పుడూ ఎన్నికల కోసం ఆలోచించలేదని.. ఒక తరం కోసం ఆలోచించినట్లు చెప్పారు. ఈ తరాన్ని కాపాడుకుంటూనే రాబోయే తరం కోసం పని చేస్తానన్నారు. తాను ఓట్ల కోసం రాలేదని.. మార్పు కోసం ఓట్లు కావాలని పవన్ వెల్లడించారు.
వైజాగ్‌లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు కావాల్సిన భూమిని ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఇవ్వలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి టీడీపీ ఎంపీ కె. రామ్మోహన్నాయుడు అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారైంది. 106.89 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జోనల్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులను మంజూరు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇందుకోసం 10 కోట్ల రూపాయలు కేటాయించాం. భూసర్వే, జోన్ ప్రధాన కార్యాలయ సముదాయం, రెసిడెన్షియల్ కాలనీ, ఇతర నిర్మాణాలకు అవసరమైన లే అవుట్ ప్లాన్ తయారీ బాధ్యతలను తూర్పుకోస్తా రైల్వే జోన్‌కు అప్పగించాం. బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వే భూమి తీసుకున్నందున దానికి బదులుగా ముడసర్లవోలో 52.2 ఎకరాల భూమిని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వేకు అప్పగించాల్సిన ఉంది. ఇందుకు అనువైన భూమిని ప్రభుత్వం ఇంకా గుర్తించి, రైల్వే శాఖకు అప్పగించాల్సి ఉంది అని అశ్వినీ వైష్టవ్ తెలిపారు. వైజాగ్ జంక్షన్-గోపాలపట్నం మధ్య 15.31 కిలోమీటర్ల మేర 159.47 కోట్ల రూపాయలతో 3,4 లైన్ల నిర్మాణం కోసం 2023 ఏప్రిల్‌లో అనుమతులు మంజూరుచేసినట్టు రైల్వే మంత్రి పేర్కొన్నారు.
విశాఖ మిధిలాపురీ కాలనీలో యదేచ్చగా అక్రమ కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నాయి. రెవెన్యూ లేఔట్ లో అర్దరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. పరదాల చాటున భారీ అక్రమ నిర్మాణం జరుపుతున్నారు. gvmc అధికారులు అక్రమ నిర్మాణానికి కొమ్ముకాస్తున్నారు. gvmc జోన్ 2 లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ గ్రావెల్ తవ్వకాలు సాగిస్తున్నారు.. ఇంత జరుగుతున్న టౌన్ ప్లానింగ్ విభాగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. అక్రమ గ్రావెల్ తవ్వకాలతో సమీప భవనాలు కూలిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్న ACP శాస్త్రి కాసులకు కక్కుర్తిపడి అడ్డగోలుగా తవ్వకాలకు సహకరిస్తున్నాడు. ఈ తతంగంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ మిథిలాపురి కాలనీలో యథేచ్ఛగా అక్రమ కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నాయి.. రెవెన్యూ లేఔట్ లో అర్దరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. పరదాల చాటున భారీ అక్రమ నిర్మాణం జరుపుతున్నారు. gvmc అధికారులు అక్రమ నిర్మాణానికి కొమ్ముకాస్తున్నారు. Gvmc జోన్ 2 లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ గ్రావెల్ తవ్వకాలు సాగిస్తున్నారు.. ఇంత జరుగుతున్న టౌన్ ప్లానింగ్ విభాగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. అక్రమ గ్రావెల్ తవ్వకాలతో సమీప భవనాలు కూలిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్న ACP శాస్త్రి కాసులకు కక్కుర్తిపడి అడ్డగోలుగా తవ్వకాలకు సహకరిస్తున్నాడు. ఈ తతంగంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ రాజధాని అమరావతేనని, కేంద్రం అభివృద్ధి చేయదలుచుకున్న రాజధానుల మాస్టర్ ప్లాన్ లో అమరావతి పేరు ఉందని నిన్న రాజ్యసభలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కుమార్ ప్రకటన చేశారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు స్పందించారు. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని కేంద్రం మరోమారు స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా మీ కళ్లు తెరవండి జగన్ మోహన్ రెడ్డి గారూ అంటూ ఎక్స్ లో వ్యాఖ్యానించారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కార్యాలయాల మార్పు కుదరదని చెప్పిన తీర్పును గౌరవించకుండా. ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణను కారణంగా చూపుతూ క్యాంపు కార్యాలయాల పేరుతో విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించవలసిన అవసరం ఏమొచ్చిందని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు.
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం, జికేవీది మండలం, కొయ్యూరు మండలాల్లో.. మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఈదురుగాలులతో పాటు ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో పరిసర ప్రాంత ప్రజలు రహదారులపై రానటువంటి పరిస్థితులలో ఉన్నారు. దీని కారణంగా ఎక్కడికక్కడ విద్యుత్తును నిలిపివేశారు అధికారులు. కొన్ని చోట్ల భారీ వృక్షాలు కూడా కూలిపోవడంతో గిరిజన ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మీచౌంగ్ తుఫాన్ కారణంగా చేతికి అందిన పంట నీటిపాలు అయ్యింది. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో అల్లూరి జిల్లా గిరిజన ప్రాంత ప్రజలు ఉన్నారు.
Read Also…
Read Also…
మిచాంగ్ తుపాను కారణంగా విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు ఇండిగో సంస్థ విశాఖపట్నం నుంచి చెన్పై వెళ్లాల్సిన రెండు విమాన సర్వీసులను నిలిపివేసింది. ఒక విజయవాడ సర్వీసును రద్దు చేసింది. తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడులోనూ కనిపిస్తోంది. దీంతో కోయంబత్తూరు-చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు ఇండిగో సంస్థ రద్దు చేసింది. చాలా విమానాలను చెన్నై ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరులోని కెంపెగౌడ్ విమానాశ్రయానికి మళ్లించారు. ఇప్పట వరకు దాదాపు 11 విమానాలను దారి మళ్లించారు.
ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు మిచోంగ్ తుఫాను ప్రభావం అధికంగా ఉంది. దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు పయనం చేస్తూ మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫాన్ గా మారుతుందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 150 రైళ్లను రైల్వే శాఖ అధికారులు రద్దు చేశారు. మరో వైపు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు దగ్గర్లో ఉన్న ఓడరేవులకి రావాలని శాటిలైట్ ఫోన్స్ ద్వారా ఇప్పటికే సమాచారం అందించారు.





Total views : 223666