Vishakapattanam
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే యువకుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యువకుడికి మూడు రోజుల నుంచి హెల్త్ బాగోకపోయినా హాస్పిటల్ కి తీసుకు వెళ్లకుండా నిర్లక్ష్యం చేసిన తిమ్మాపూర్ విజ్ఞాన్ కాలేజ్ యాజమాన్యం. బంగారు భవిష్యత్తు ఉన్న యువకుడుని ఇలా చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని వారు అర్ధనాళాలు పెడుతున్నారు. మూడు రోజుల నుంచి బాగోకపోతే స్కూలు యాజమాన్యం ఏం చేస్తుంది? వీళ్ళకి సెక్యూరిటీగా ఉన్న వార్డెన్ ఎందుకు నిర్లక్ష్యం వహించాడు. తల్లిదండ్రులకి చెప్పాల్సిన యాజమాన్యం ఎందుకు ఇంత గోప్యతగా ఉంచుతున్నారని వారన్నారు. ఈ విషయాన్ని బయటికి రాకుండా రాత్రికి రాత్రే అక్కడనుంచి ఆ మృతదేహాన్ని మార్చురీకి తరలించి ఎవరిని దగ్గరికి రాకుండా మేనేజ్ చేశారని వారు చెబుతున్నారు. స్కూల్ యాజమాన్యం పోలీసులతో కుమ్మక్కై ఈ విషయాన్ని బయటకి తెలియకుండా ఉంచారని వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి యాజమాన్యం స్కూల్ లైసెన్స్ ని రద్దు చేసి ఇంత నిర్లక్ష్యం వహించిన యాజమాన్యంపై డీఈవో తక్షణ చర్యలు తీసుకుని వీళ్ళ లైసెన్సులు రద్దు చేయాలని మా కుమారుడికి జరిగిన అన్యాయం ఏ ఒక్కరికి జరగకూడదని మాకు పుత్ర శోకం కలిగించినవంటి యాజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆ యువకుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖ జిల్లా మధురవాడ వాంబే కాలనీలోని ఓ ఇంట్లో వంట గ్యాస్ లీకై నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మధురవాడ వాంబే కాలనీలో వై.బాలరాజు అనే వ్యక్తి కొత్త సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను అమర్చాడు. అయితే.. సరిగా అమర్చకపోవడంతో గ్యాస్ లీకై ఇళ్లంతా వ్యాపించింది. ఈ క్రమంలో దేవుడి చిత్ర పటాల వద్ద దీపారాధన చేయడానికి అగ్గి వెలిగించడంతో ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వస్తువులన్నీ మంటల్లో దగ్ధమయ్యాయి. క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Read Also..
Read Also..
ఆస్ట్రేలియాతో విశాఖలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 2 వికెట్లతో విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 80, ఇషాన్ కిషన్ 58 పరుగులతో రాణించగా, ఆఖర్లో రింకూ సింగ్ 22 పరుగులతో నాటౌట్ గా కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ చివరి బంతి వరకు సాగినా రింకూ సింగ్ పవర్ హిట్టింగ్ తో టీమిండియా గెలుపు తీరాలకు చేరింది. ఆఖరి ఓవర్లో 7 పరుగులు కావాల్సి ఉండగా టీమిండియా 3 వికెట్లు చేజార్చుకుంది. అక్షర్ పటేల్ బంతిని గాల్లోకి కొట్టి బౌలర్ అబ్బాట్ కే క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాతి బంతికే రవి బిష్ణోయ్ రనౌట్ అయ్యాడు. చివరి 2 బంతుల్లో 2 పరుగులు అవసరమైన స్థితిలో, అర్షదీప్ రనౌట్ కావడంతో, చివరి బంతికి 1 పరుగు కావాల్సి వచ్చింది. క్రీజులో ఉన్న రింకూ సింగ్ బలంగా కొట్టిన షాట్ నేరుగా స్టాండ్స్ లో పడింది. కేవలం 1 పరుగు అవసరమైన ఆ దశలో రింకూ సిక్స్ కొట్టినప్పటికీ, అది నోబాల్ కావడంతో ఆ 6 పరుగులు స్కోరుకు జతకలవవు. నోబాల్ కు వచ్చిన ఎక్స్ ట్రాతోనే టీమిండియా విజయం సాధించినట్టయింది. రింకూ 14 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేశాడు.5 మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఈ నెల 26న తిరువనంతపురంలో జరగనుంది.
విశాఖలో ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు 35 శాఖల కార్యాలయాలకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలు కేటాయించారు. ఆంధ్రా వర్సిటీ, రుషికొండ, చినగదిలి సమీపంలో కొన్ని శాఖలకు భవనాలు కేటాయించారు. పలు శాఖలకు ఎండాడ, హనుమంత్వాక ప్రాంతాల్లో కేటాయించారు. జీఏడీ, ఆర్థిక, గ్రామవార్డు సచివాలయ, ఇంధన మినహా ఇతర శాఖలకు భవనాలు కేటాయించారు. 2.27 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యాలయాలు, విడిది అవసరాలకు కూడా భవనాలను కేటాయించింది.
Read Also..
Read Also..
విశాఖలో ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు సిద్ధమయ్యాయియ. ఈ మేరకు 35 శాఖల కార్యాలయాలకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలు కేటాయించారు. ఆంధ్రా వర్సిటీ, రుషికొండ, చినగదిలి సమీపంలో కొన్ని శాఖలకు భవనాలు కేటాయించారు. పలు శాఖలకు ఎండాడ, హనుమంత్వాక ప్రాంతాల్లో కేటాయించారు. జీఏడీ, ఆర్థిక, గ్రామవార్డు సచివాలయ, ఇంధన మినహా ఇతర శాఖలకు భవనాలు కేటాయించారు. 2.27 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యాలయాలు, విడిది అవసరాలకు కూడా భవనాలను కేటాయించింది.
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు మంత్రి అప్పలరాజు బాధితులకు నష్టపరిహారాన్ని అందజేశారు. ఈ ప్రమాదంలో హార్బర్ లోని 30 బోట్లు మంటల్లో కాలిపోయాయి. మరో 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల వ్యవధిలోనే జిల్లా కలెక్టర్ ఖాతాకు నిధులు జమచేశారు. ఈ మొత్తాన్ని మంత్రి అప్పలరాజు బాధితులకు అందజేశారు. కాలిపోయిన బోట్ల విలువలో 80 శాతం పరిహారంగా మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ విశాఖ హార్బర్ ప్రమాదానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం జరిగిందని మండిపడ్డారు. సీఎం జగన్ ఎలాంటి వివక్ష చూపకుండా పరిహారాన్ని అందజేశారన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పరిణామాల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిపోయిన నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఈ నెల 27న పున:ప్రారంభం కానుంది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో పాదయాత్రను తిరిగి కొనసాగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా సెప్టెంబరు 9న పాదయాత్రకు బ్రేక్ ప్రకటించిన కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అయితే ముందుగా నిర్దేశించుకున్నట్టుగా యువగళం యాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగదు. డిసెంబర్ చివరిలో విశాఖపట్నంలోనే ముగియనుంది. దాదాపు రెండున్నర నెలలపాటు విరామం రావడం, మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలో ముగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. 27న పున:ప్రారంభమై రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ పట్టణ, కాకినాడ గ్రామీణ, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకున్నాక అక్కడ పాదయాత్రను ముగించనున్నారు. ఇందుకు తగ్గట్టు రూట్ మ్యాప్‌ను పార్టీ వర్గాలు రూపొందిస్తున్నాయి. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని లోకేశ్ భావించారు. జనవరి 27న కుప్పంలో మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు అరెస్ట్ పర్యవసనాల నేపథ్యంలో దాదాపు రెండున్నర నెలలపాటు అంతరాయం ఏర్పడింది. తాత్కాలిక విరామం ప్రకటించే సమయానికి 208 రోజుల్లో 2,852.4 కిలోమీటర్లు పూర్తయ్యింది. 84 నియోజకవర్గాల గుండా ఈ యాత్ర కొనసాగింది. పెద్ద సంఖ్యలో బహిరంగ సభలతోపాటు యువత, మహిళలు, రైతులు, ముస్లింలు, వివిధ వర్గాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ లోకేశ్ యాత్రను కొనసాగించారు. ఇదిలావుండగా గతంలో చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర కూడా విశాఖపట్నంలోనే ముగిసిందని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు లోకేశ్ పాదయాత్ర కూడా అక్కడే ముగియనుందని, ఈ మేరకు రూట్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నట్టు చెబుతున్నారు.
Read Also..
Read Also..
విశాఖ ఎన్ఏడీ లో నిన్న జరిగిన స్కూల్ ఆటోలా ప్రమాదం ఎఫెక్ట్. నగరంలో ఆర్టీవో అధికారులు ప్రత్యేక తనిఖీలు. ఏక కాలంలో మూడు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు మద్దిలపాలెం, ఎన్ఏడి, గాజువాక ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న అధికారులు. నిన్న 28 ఆటోలు సీజ్. ఈ రోజు 16 కేసులు నమోదు, 5 ఆటోలు సీజ్. గరిష్టంగా ఆటోకి 6 గురు ఉండాలని అధికారులు సూచనలు ఆటో కి 8-10 మంది ఉంటే రూ.1000 చలానా 10 మందికి మించి ఉంటే ఆటో ను సీజ్ చేస్తున్న అధికారులు. ఆటో డ్రైవర్ లకు కౌన్సిలింగ్ ఇస్తున్న అధికారులు…




Total views : 223651