రాజధాని అమరావతి ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటనలపై ఇరువర్గాల నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు.
సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లో పర్యటించేందుకు వచ్చిన వైసీపీ నేతలను.. ఉండవల్లి వద్ద అమరావతి రైతులు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు. రాజధానికి ద్రోహం చేసిన వైసీపీ నాయకులకు ఇక్కడ పర్యటించే హక్కు లేదంటూ రైతులు, మహిళలు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి.. అది కాస్తా పరస్పర దాడులకు దారితీసింది. రెండు వైపులా రాళ్లు, కోడిగుడ్లు విసురుకోవడంతో.. ఘర్షణలో పలువురు రైతులకు గాయాలయ్యాయి. దీంతో మండిపడ్డ రాజధాని ప్రజలు .. వైసీపీ ఎమ్మెల్సీ కారు అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి చేతులు దాటిపోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాలను చెదరగొట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘర్షణపై ఇరు వర్గాలు పరస్పరం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అమరావతిలో నిన్న వైసీపీ నేతలను అడ్డుకున్న రైతులు.
180
previous post