Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh కాలుష్య కోరల్లో చిక్కుకున్న విశాఖపట్నం.

కాలుష్య కోరల్లో చిక్కుకున్న విశాఖపట్నం.

by CVR NEWS
కాలుష్య కోరల్లో చిక్కుకున్న విశాఖపట్నం

విశాఖపట్నం గాజువాకలో కాలుష్యానికి వ్యతిరేకంగా జనం రోడ్డెక్కారు. కాలుష్య వ్యతిరేక పోరాట వేదిక ఆధ్వర్యంలో.. గాజువాక జగ్గు జంక్షన్ వద్ద భారీ మానవహారం నిర్వహించారు. కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్న పరిశ్రమలను వెంటనే రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. ముఖ్యంగా అదాని గంగవరం పోర్టు కాలుష్యంపై.. కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు నినదించారు. రామచంద్రనగర్ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను వెంటనే తరలించాలని.. అలాగే విశాఖ డైరీ వల్ల జరుగుతున్న జల, వాయు కాలుష్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. అక్కిరెడ్డిపాలెం పరిసరాల్లో విషపూరిత సరుకులు నిల్వ చేస్తున్న గోడౌన్లను నిలిపివేయాలని.. నివాస ప్రాంతాలను కమ్మేస్తున్న దుమ్ము, ధూళిని నియంత్రించడంతో పాటు భారీ వాహనాలను దారి మళ్లించాలని కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ నేతలు డిమాండ్ చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: